
మొలకల్లో ఎక్కువ ప్రొటీన్, తక్కువ క్యాలరీలు, సోడియం, ఫ్యాట్ ఉంటాయి. అయితే వీటితో లాభాలెన్ని ఉన్నాయో నష్టాలు కూడా అన్నే ఉన్నాయి అంటున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్.
- మొలకలు తినడం వల్ల శరీరంలో విటమిన్–సి, క్యాల్షియం, సల్ఫోరాఫేన్స్ అనే ఫైటోన్యూట్రియెంట్స్ పెరుగుతాయి. ఇవి శరీరంలో పాస్ఫరస్ కంటెంట్, చెడు కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్‌ను తగ్గిస్తాయి.
- మామూలుగానే ఎక్కువ ఫైబర్, ప్రొటీన్స్, న్యూట్రియెంట్స్ అరగడానికి కాస్త టైం పడుతుంది. అందుకే వాతం ఉన్నవాళ్లు వీటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటివల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
- గింజల్ని నానబెట్టి, తరువాత గుడ్డలో చుట్టి మొలకెత్తిస్తే వాటిలో బ్యాక్టీరియా చేరుతుంది. అవి కడగకుండా, వేడిచేయకుండా తింటే రోగాల బారిన పడొచ్చు. రోజూ మొలకలు తింటే కడుపులో మంట, పొత్తి కడుపు నొప్పి, డయేరియా వచ్చే అవకాశం కూడా ఉంది.
- అందుకే రోజూ ఒకే రకమైన మొలకలు కాకుండా రోజుకో రకం తినాలి. లేదా బ్రొకొలి, క్యారెట్, బీట్‌రూట్, కీరాతో కలిపి తిన్నా బెటర్‌గా ఉంటుంది.