వచ్చే వారం నుంచి మార్కెట్ లోకి స్పుత్నిక్ వీ

వచ్చే వారం నుంచి మార్కెట్ లోకి స్పుత్నిక్ వీ

న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ పై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వచ్చే వారం నుంచి స్పుత్నిక్ వీ మార్కెట్ లో అందుబాటులో ఉందనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రష్యాలోని గమలేయా నేషనల్ సెంటర్ తయారు చేసిన ఈ టీకా ఉత్పత్తి భారత్ లో జూలైలో మొదలవుతుందని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న డాక్టర్ రెడ్డీస్ స్పుత్నిక్ వీ లోకల్ ప్రొడక్షన్ చేయనుంది.