ఛీ.. ఇక మీరు మారరు.. మళ్లీ పరువు పొగొట్టుకున్న పాక్: ఒక్క ఫొటోతో పాక్ ప్రచారానికి చెక్

ఛీ.. ఇక మీరు మారరు.. మళ్లీ పరువు పొగొట్టుకున్న పాక్: ఒక్క ఫొటోతో పాక్ ప్రచారానికి చెక్

న్యూఢిల్లీ: మమ్మల్ని మించి ఈ ప్రపంచంలో అబద్ధాలు ఎవరూ ఆడలేరనే విషయాన్ని పాక్ మరోసారి రుజువు చేసుకుంది. అసత్య ప్రచారంలో.. భారత్‎పై విషం చిమ్మడంలో మాకు మేమే సాటి అని పాక్ మళ్లీ నిరూపించుకుంది. ఇలా ఎందుకు అంటున్నానంటే ఒక కారణం ఉంది.. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియా ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్‎లో భాగంగా పాక్, పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది భారత సైన్యం. 

ఇండియా చేతిలో చావు దెబ్బ తిన్నప్పటికీ ప్రపంచ దేశాల ముందు పరువు పోకుండా తప్పుడు ప్రచారానికి తెరలేపింది పాక్. ఆపరేషన్ సిందూర్‎లో ఆరు ఇండియన్ రాఫెల్ ఫైటర్ జెట్లను కూల్చామని ఫేక్ ప్రచారం చేసింది. ఇక్కడితో ఆగకుండా.. సియాల్‌కోట్ సమీపంలో IAF పైలట్ శివాంగి సింగ్ నడిపిన రాఫెల్ యుద్ధ విమానాన్ని కూల్చి ఆమెను కస్టడీలోకి తీసుకున్నామని పుకార్లు వ్యాప్తి చేసింది.

 ఆపరేషన్ సిందూర్ తర్వాత నుంచి పైలట్ శివాంగి బయట ఎక్కడ కనబడకపోవడంతో పాక్ ప్రచారంపై కొంత గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో పాక్ తప్పుడు ప్రచారానికి చెక్ పెట్టింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. 2025, అక్టోబర్ 9న ఎయిర్ ఫోర్స్ స్టేషన్ తాంబరంలోని ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్స్ స్కూల్‌లో 159వ క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్ కోర్సు (QFIC) ముగింపు వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో పైలట్ శివాంగి సింగ్ పాల్గొన్నారు. 

►ALSO READ | నా నోబెల్ ప్రైజ్ ట్రంప్‎కు అంకితం చేస్తున్నా: కొరీనా మచాడో కీలక ప్రకటన

SASO శిక్షణ కమాండ్ ఎయిర్ మార్షల్ తేజ్‌బీర్ సింగ్ చేతుల మీదుగా ఆమె ప్రతిష్టాత్మక క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్ (QFI) బ్యాడ్జ్ అందుకున్నారు. శివాంగి సింగ్ క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్ బ్యాడ్జ్ అందుకున్న ఫొటోలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో శివాంగి సింగ్‎ను అరెస్ట్ చేశామని పాకిస్తాన్ చేస్తోన్న తప్పుడు ప్రచారానికి తెరపడింది. తద్వారా మరోసారి పాకిస్తాన్ తమ పరువు తామే తీసుకుంది. తప్పుడు ప్రచారంతో ప్రపంచదేశాల ముందు మళ్లీ ఇజ్జత్ పొగొట్టుకుంది. 

శివాంగి సింగ్ ఎవరంటే..?

శివాంగి సింగ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్. రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపిన భారతదేశపు తొలి మహిళా పైలట్‎గా ఆమె రికార్డ్ సృష్టించారు.  ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేపట్టిన ఎన్నో ప్రతిష్టాత్మక ఆపరేషన్లలో శివాంగి సింగ్ పాల్గొన్నారు. ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‎లో కూడా ఆమె కీలక పాత్ర పోషించారు.  నైపుణ్యం, ధైర్యానికి పేరుగాంచిన శివాంగి సింగ్ సాయుధ దళాల్లో చేరడానికి యువ ఔత్సాహికులను ముఖ్యంగా మహిళలకు ఆమె ప్రేరణగా నిలుస్తున్నారు.