Squid Game Season 2 OTT: మోస్ట్ పాపులర్ స్క్విడ్ గేమ్ సీజన్‍ 2 అప్‍డేట్.. స్ట్రీమింగ్‍ ఎప్పటినుండి అంటే?

Squid Game Season 2 OTT: మోస్ట్ పాపులర్ స్క్విడ్ గేమ్ సీజన్‍ 2 అప్‍డేట్.. స్ట్రీమింగ్‍ ఎప్పటినుండి అంటే?

కొరియన్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్(Squid Game) ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2021లో రిలీజైన ఈ డిస్టోపియన్ డ్రామా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‍ఫ్లిక్స్ స్ట్రీమ్ అయినా ఈ సినిమా  సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. గ్లోబల్‍ వైడ్ గా అత్యధిక వ్యూస్ సాధించిన వెబ్ సిరీస్ గా టాప్ లో నిలిచింది.  ఇక మొదటి పార్ట్ భారీ విజయాన్ని సాధించిన నేపధ్యంలో రెండో సీజన్ ను కూడా ప్లాన్ చేశారు మేకర్స్. దాంతో స్క్విడ్ గేమ్ సీజన్‍ 2(Squid Game Season 2)  ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్.

వారి ఎదురుచూపులకి ఎండ్ కార్డు వేస్తూ స్క్విడ్ గేమ్ సీజన్‍ 2పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అదేంటంటే.. స్క్విడ్ గేమ్ సీజన్‍ 2 ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. అయితే.. ఈ సీజన్ 2 ఎప్పుడు విడుదల కానుంది అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే.. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు స్క్విడ్ గేమ్ సీజన్‍ 2 2024 ద్వితీయార్ధంలో వచ్చే అవకాశం ఉందట. అంటే.. ఆగస్టు తరువాత సీజన్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇదే విషయంపై త్వరలో అధికారిక ప్రకటన రానుంది. ఈ న్యూస్ తెలుసుకున్న సిరీస్  అభిమానులు  ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.