
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నిత్యం ఏదోఒకటి కైంకర్యం జరుగుతుంది. ఈ రోజు (ఆగస్టు 9) శనివారం శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో స్వామి వారికి ఉపకర్మ సేవ వైభవంగా జరిగింది. ఉదయం 6 గంటలకు స్వామివారికి శ్రీ భూవరహస్వామివారి ఆలయంలో సంప్రదాయంగా యఙ్ఞోపవీతాన్ని మార్చారు. శ్రీకృష్ణస్వామివారిని.. శ్రీ భూవరహస్వామివారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చి స్నపన తిరుమంజనం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా అర్చక స్వాముల వారు కలియుగ దేవుడు..తిరుమల శ్రీవెంటేశ్వరస్వామికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం యజ్ఞోపవీతాన్ని సమర్పించి .. హారతి ఇచ్చి.. ఆస్థానం నిర్వహించి మరల ఊరేగింపుగా గోవింద నామ స్మరణతో శ్రీ కృష్ణ స్వామి వారిని తిరిగి ఆలయానికి చేరుకుంటూ .. భక్తులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పారుపత్తేదార్ శ్రీ హిమంతగిరి, అర్చకులు, ఇతర ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
►ALSO READ | Weekend Special Recipes : కరకరలాడే పకోడీ వెరైటీలు.. ఇంట్లోనే 10 నిమిషాల్లో ఇలా రెడీ చేసుకోండి