Sreeleela: ‘జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ కోసం శ్రీలీల భారీ రెమ్యూనరేషన్.. ఎన్ని కోట్లు తీసుకుందంటే?

Sreeleela: ‘జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ కోసం శ్రీలీల భారీ రెమ్యూనరేషన్.. ఎన్ని కోట్లు తీసుకుందంటే?

కర్ణాటక మాజీ మంత్రి, పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కొడుకు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’.లేటెస్ట్ సెన్సేషన్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది. జెనీలియా కీలకపాత్రలో నటిస్తూ సౌత్‌‌‌‌‌‌‌‌లో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈమూవీ జులై 18న తెలుగు, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఇంకో నాలుగు రోజుల్లో మూవీ థియేటర్లో సందడి చేయనుంది. విడుదలైన ట్రైలర్లు, సాంగ్స్ సినిమాపై పాజిటివ్ బజ్‌ని పెంచాయి.

అయితే,‘జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’హైప్ అంత శ్రీలీలపైనే ఉంది. కిరీటి రెడ్డికి ఇది తొలిసినిమా. శ్రీలీలను నమ్ముకునే ప్రేక్షకులు థియేటర్స్కు వస్తారు. అలా శ్రీలీల తన యాక్టింగ్, గ్లామర్ తోనే ఆడియన్స్ని కట్టిపడేసేలా చేయాలి. తన అందచందాలతో మరోసారి హాట్ షోతో మెప్పించాలి. అది వైరల్ వయ్యారి పాటతోనే ప్రూవ్ చేసింది. ఈ క్రమంలోనే శ్రీలీల గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది.

లేటెస్ట్ టాక్ ప్రకారం.. ‘జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’మూవీ కోసం శ్రీలీల భారీ రెమ్యునరేషన్ తీసుకుందనేది ఇపుడు హాట్ టాపిక్గా మారింది. మేకర్స్ ఏకంగా రూ.2.5 కోట్లు శ్రీలీలకు చెల్లించారని తెలుస్తోంది. 'కిసిక్' పాటకు శ్రీలీల రూ.2 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం.

ప్రస్తుతం శ్రీలీల వరుస ఫెయిల్యూర్స్తో సతమవుతుంది. అయినప్పటికీ భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తుంది. శ్రీలీల ఇప్పుడు టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం పొందుతున్న యంగ్ హీరోయిన్స్ లో ఒకరు. ప్రస్తుతం శ్రీలీల చేతిలో ఓ అయిదు సినిమాలున్నాయి. జూనియర్తో పాటు రవిజేత సినిమా మాస్ ధమాకా,ఉస్తాద్ భగత్ సింగ్, హిందీలో ఆషికి 3, తమిళంలో పరాశక్తి సినిమాలు చేస్తోంది. 

వైరల్ వయ్యారి నేనే:

‘‘వైరల్ వయ్యారి నేనే..  వయసొచ్చిన అణుబాంబునే.. ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌లో నా ఫాలోయింగ్.. చూశావంటే బైండ్ బ్లోయింగ్.. నేనేమీ చేసినా ఫుల్ ట్రెండింగు..’’ అంటూ ప్రస్తుత సోషల్ మీడియా పోకడల గురించి కళ్యాణ చక్రవర్తి త్రిపురనేని రాసిన సాహిత్యం ఆకట్టుకుంది.

క్యాచీ ట్యూన్‌‌‌‌తో కంపోజ్‌‌‌‌చేయడంతో పాటు హరిప్రియతో కలిసి పాడారు దేవిశ్రీ ప్రసాద్. మరోసారి తన ఎనర్జిటిక్ డ్యాన్స్‌‌‌‌ మూమెంట్స్‌‌‌‌ మాస్‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌లో సత్తా చాటింది శ్రీలీల. తనను మ్యాచ్ చేస్తూ కిరీటీ గ్రేస్‌‌‌‌ఫుల్‌‌‌‌గా వేసిన స్టెప్పులు ఇంప్రెస్ చేస్తున్నాయి.