SRH VS CSK: సన్‌రైజర్స్‌దే టాస్.. తుది జట్టులో తెలుగు కుర్రాడికి చోటు

SRH VS CSK:  సన్‌రైజర్స్‌దే టాస్.. తుది జట్టులో తెలుగు కుర్రాడికి చోటు

ఐపీఎల్ 2024లో హై ఓల్టేజ్ సమరానికి సమయం ఆసన్నమైంది. ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ సారథి పాట్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో సీఎస్‌కే మొదట బ్యాటింగ్ చేయనుంది.

ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ భారీ మార్పులతో బరిలోకి దిగుతోంది. మొయిన్ అలీ, తీక్షణ , ముఖేష్ చౌదరి జట్టులోకి వచ్చారు. మరోవైపు, సన్‌రైజర్స్... మయాంక్ అగర్వాల్ అస్వస్థతకు గురికావడంతో అతని స్థానంలో తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డికు చోటిచ్చింది.

ఇప్పటివరకూ ఇరు జట్లు మూడేసి మ్యాచ్‌లు ఆడగా.. చెన్నై రెండింటిలో.. సన్ రైజర్స్ ఒక దానిలో విజయం సాధించాయి. పాయింట్ల పట్టికలోమూడో స్థానంలో ఉండగా.. ఎస్ఆర్ హెచ్ ఏడో స్థానంలో ఉంది. 

తుది జట్లు

సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, నటరాజన్,  జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే.

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, మొయిన్ అలీ, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), దీపక్ చాహర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే.