పది ఫలితాల్లో శ్రీచైతన్య విజయ దుందుభి

పది ఫలితాల్లో శ్రీచైతన్య విజయ దుందుభి
  •     1402 మంది స్టూడెంట్స్ కు 10 జీపీఏ

మాదాపూర్ : పదవ తరగతి ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యాసంస్థల స్టూడెంట్స్ విజయ దుందుభి మోగించారు. టెన్త్ ఫలితాల్లో రాష్ట్రంలోనే శ్రీ చైతన్య స్కూల్స్ మొదటి స్థానంలో ఉందని శ్రీ చైతన్య స్కూల్స్ డైరెక్టర్ సీమ తెలిపారు. మంగళవారం మాదాపూర్ ఎన్సీసీ బిల్డింగ్ లో  సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీమ మాట్లాడుతూ.. పదవ తరగతి ఫలితాల్లో శ్రీ చైతన్య స్కూల్స్ స్టూడెంట్స్ 1402 మంది 10/10 జీపీఏ సాధించారని తెలిపారు.

అలాగే.. 9.8 జీపీఏ ఆపైన సాధించిన వారు 2803, 9.0 జీపీఏ ఆపైన సాధించిన  వారు 8216 మంది ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో 10/10 జీపీఏ సాధించిన మొత్తం విద్యార్థుల్లో 16% శ్రీచైతన్య విద్యార్థులే ఉండడం సంతోషకరమని  అన్నారు. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ, రీసెర్చ్ ఓరియెంటెడ్ టీచింగ్ మెథడాలజీ, సీఐపీఎల్, ఎంపీఎల్, ఐకాన్, సీ-బ్యాచ్, సివిల్స్, మెడికానై, టెక్నో వంటి పటిష్ఠమైన అకాడమిక్ ప్రోగ్రామ్స్, మైక్రో లెవెల్ టీచింగ్ సిస్టం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.  టెన్త్ పాస్ అయిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఆమె అభినందనలు తెలియజేశారు.