హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న సూడాన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కావేరి’ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా సూడాన్ ఓడరేవుకు దాదాపు 500 మంది వరకు భారతీయులు చేరుకున్నారు.
ఈ క్రమంలో భారత్ మరోసారి తన పెద్ద మనసు చాటుకుంది. శ్రీలంకకు అండగా నిలిచింది. శ్రీలంక దేశస్థులను సూడాన్ నుంచి తరలించడానికి శ్రీలంక ప్రభుత్వానికి భారత్ సహకారం అందిస్తోంది. ఈ విషయంపై శ్రీలంక.. భారత్ కు ధన్య వాదాలు తెలిపింది. భారత్ సాయంతో మరికొన్ని రోజుల్లో శ్రీలంక దేశస్థులందరినీ సురక్షితంగా స్వదేశానికి తీసుకురాగలమని శ్రీలంక ధీమా వ్యక్తం చేసింది.