పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. ‘‘యువకుడు, ఉత్సాహవంతుడు, చదువుకున్న వ్యక్తి, ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలనే సంకల్పంతో ఉన్న గడ్డం వంశీకృష్ణను కాంగ్రెస్ హైకమాండ్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా నిర్ణయించింది. కాకా వెంకటస్వామి మనుమడిగా, వివేక్ వెంకటస్వామి కొడుకుగా, యువతకు స్ఫూర్తిగా నిలువాలని రాజకీయాల్లోకి వచ్చిండు.
కొంతమంది రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తిగా వచ్చిండని అంటున్నరు. కానీ అతడు చిన్న వయసులోనే సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్‌గా గుర్తింపు తెచ్చుకున్నడు. తనకున్న అనుభవం, నైపుణ్యం, మేధాశక్తితో ఈ ప్రాంత యువతకు, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఆశయంతో ఉన్నడు. ప్రజాసేవ కోసం వచ్చిన వంశీని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్పరిధిలోని ఎమ్మెల్యేలందరం ఆయనకు మద్దతునిస్తున్నాం.
బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులతో బేరీజు వేసుకొని ఓటు వేయండి. మీలో ఒకడిగా ఉంటడు. ఢిల్లీలో ఏ పని ఉన్నా చేసి పెడ్తడు. గ్రామాలకు వెళ్లి వంశీ గురించి ప్రజలకు చెప్పండి. మీరందరు అతడిని ఆశీర్వదించండి. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన దానికంటే డబుల్ మెజారిటీతో గెలిపించండి’’ అని పిలుపునిచ్చారు.