
వరుస సినిమాల తర్వాత చిన్న గ్యాప్ ఇచ్చిన శ్రీలీల తిరిగి బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌తో బిజీ అవుతోంది. రీసెంట్‌గా రవితేజకు జంటగా ఆమె నటిస్తున్న చిత్రం ప్రారంభమైంది. తాజాగా నితిన్‌కు జంటగా శ్రీలీల నటిస్తున్న ‘రాబిన్‌హుడ్’ సినిమా నుంచి తన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. శ్రీలీల బర్త్ డే సందర్భంగా విషెస్ చెబుతూ విడుదల చేసిన ఈ పోస్టర్ ఇంప్రెస్ చేస్తోంది. ‘లేడీ బాస్ నీరా వాసుదేవ్’ అంటూ తన పాత్రను పరిచయం చేశారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియో గ్లింప్స్‌లో చుట్టూ టైట్ సెక్యూరిటీతో ప్రైవేట్ జెట్‌లో దిగినట్లు చూపించారు. ‘సునామీలో టి సైలెంట్ ఉండాలి... నా ముందు నువ్వు సైలెంట్‌గా ఉండాలి’ అంటూ వెన్నెల కిషోర్‌తో ఆమె చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. యారగెంట్, పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో తను నటిస్తున్నట్టు ఈ వీడియోతో అర్థమవుతోంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20న విడుదల కానుంది.