
సౌత్ లేటెస్ట్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ మరో క్రేజీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసినందుకు సిద్దమయింది. అది కూడా సౌత్ లో కాదు.. నార్త్ ఇండస్ట్రీలో. స్థార్ హీరో కొడుకు హీరోగా వస్తున్న ఈ ప్రెస్టీజియస్ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలను ఫిక్స్ చేశారట మేకర్స్. ప్రస్తుతం ఇటు తెలుగు, అటు హిందీ ఇండస్ట్రీలలో ఈ టాపిక్ వైరల్ గా మారింది.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. బాలీవుడ్ స్టార్ సైఫ్ ఆలీ ఖాన్ వారసుడు ఇబ్రహీం అలీ ఖాన్(Ibrahim Ali khan) హీరోగా దిలేర్ అనే సినిమా చేస్తున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో రానున్న ఈ సినిమాను దర్శకుడు కృణాల్ దేశ్‍ముఖ్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంతవరకు జరిగింది. ఈ సినిమా కోసం సౌత్ బ్యూటీ శ్రీలీల అయితే బాగుంటుందని ఫిక్స్ అయ్యారట దర్శకుడు కృణాల్ దేశ్‍ముఖ్. ఇదే విషయం గురించి శ్రీలీల దగ్గర ప్రస్తావించగా ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం, త్వరలోనే శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఇక ప్రస్తుతం శ్రీలీల చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుత ఆమె తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక మరో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా వస్తున్న అనగనగా ఒకరోజు సినిమాలో కూడా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా కూడా త్వరలోనే థియేటర్స్ లోకి రానుంది.