
మొదటి మూవీ ‘పెళ్లి సందD’తోనే టాలీవుడ్‌లో చక్కని గుర్తింపు తెచ్చుకుంది శ్రీలీల. క్యూట్ లుక్స్‌తో ఇండస్ట్రీ దృష్టిని ఆకట్టుకున్న ఆమె.. టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకెళుతోంది. రవితేజ ‘ధమాకా’, నితిన్ కొత్త సినిమాతో పాటు మరికొన్ని చిత్రాల్లోనూ శ్రీలీల నటిస్తోంది. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టు తన ఖాతాలో చేరింది. బాలకృష్ణ హీరోగా రూపొందనున్న చిత్రంలో లీల నటించబోతోంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న బాలకృష్ణ, ఆ తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఓ మూవీ చేయబోతున్నారు. త్వరలో సెట్స్‌కి వెళ్లనున్న ఈ చిత్రంలోనే లీల నటించబోతోంది. అయితే హీరోయిన్‌గా మాత్రం కాదు. బాలకృష్ణ కూతురిగా ఆమె కనిపించబోతోంది. ‘ఎఫ్ 3’ మూవీ ప్రమోషన్స్‌లో ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ కన్‌ఫర్మ్ చేశాడు. ఈ మూవీలో బాలయ్య యాభయ్యేళ్ల వయసు గల పాత్ర చేయనున్నారు. ఆయన క్యారెక్టర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతోంది. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ అనేది మెయిన్ పాయింట్ కావడంతో ఈ చిత్రంలో శ్రీలీల క్యారెక్టర్ కీలకం కానుంది. మొత్తానికి కెరీర్ ప్రారంభంలోనే బాలకృష్ణ లాంటి మాస్ హీరో సినిమాలో చాన్స్ దక్కించుకోవడమంటే ఆమె కెరీర్‌కి ఈ మూవీ కచ్చితంగా ప్లస్ అవుతుంది.