డాక్టర్ నిర్లక్ష్యం వల్లే.. శ్రీనివాస్ మరణించాడు.. క్లినిక్ ముందు ఆందోళన

డాక్టర్ నిర్లక్ష్యం వల్లే.. శ్రీనివాస్ మరణించాడు.. క్లినిక్ ముందు ఆందోళన

హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని బుద్వేల్ మెడికల్ షాపు ముందు మృతి చెందిన శ్రీనివాస్ భార్య ఆందోళన చేపట్టింది. ఆర్ఎంపీ డాక్టర్ రాఘవ రావు నిర్లక్ష్యం వల్లే తన భర్త చనిపోయారంటూ ఆరోపణ చేసింది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛాతీలో నొప్పిగా ఉందంటూ బుద్వేల్ దగ్గర రాఘవ రావు క్లినిక్ కు శ్రీనివాస్ వచ్చారు. 

అయితే ఆర్ఎంపీ డాక్టర్ రాఘవ రావు శ్రీనివాస్ ను పరీక్షించి.. ఓ ఇంజక్షన్ ఇచ్చి.. మందులు రాసి మెడికల్ షాపుకు వెళ్లి తీసుకురమ్మని శ్రీనివాస్ కు ఇచ్చాడు. మందులు తీసుకుంటూ శ్రీనివాస్ మెడికల్ షాపు ముందు ఒక్కసారిగా కుప్పకూలాడు. ఆర్ఎంపీ డాక్టర్ ఇచ్చిన ఇంజక్షన్ ఓవర్ డోస్ తోనే శ్రీనివాస్ చనిపోయాడని బంధువులు ఆరోపించారు. తమకు న్యాయం జరిగే వరకు క్లినిక్ ముందు నుంచి జరిగేదే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఏం జరిగిందంటే..

మందుల కోసం ఓ మెడికల్‌ షాప్‌కు వచ్చిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన హైదరాబాద్‌ శివారు రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బుద్వేల్‌లో చోటుచేసుకుంది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్లకు చెందిన శ్రీనివాస్‌ (35) రాజేంద్రనగర్‌లోని బుద్వేల్‌కు వలస వచ్చాడు. అతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆగస్టు 14  సోమవారం ఉదయం శ్రీనివాస్‌కు ఛాతీలో నొప్పిరావడంతో స్థానికంగా ఉన్న ఓ ఆర్ఎంపీ డాక్టర్‌ వద్దకు వెళ్లాడు. డాక్టర్‌ పరీక్షించి అతడికి మందులు రాసిచ్చారు. మందులు కొనుగోలు చేసేందుకు శ్రీనివాస్‌ మెడికల్‌ షాప్‌కు వెళ్లి అక్కడే కుప్పకూలి మృతిచెందాడు.