అయోధ్య రామాలయంలో మరో అద్భుతం.. ఏప్రిల్​ 17న శ్రీరామ చంద్రుడికి సూర్య తిలకం..

అయోధ్య రామాలయంలో మరో అద్భుతం.. ఏప్రిల్​ 17న శ్రీరామ చంద్రుడికి సూర్య తిలకం..

అయోధ్య రామ మందిరం నిర్మాణంలో అడుగడుకునా అద్భుతాలే. అందులో ఒకటి సూర్యతిలకం. ఏటా శ్రీరామనవమి రోజు ఈ ప్రత్యేకత భక్తులకు దర్శనమివ్వబోతోంది... ఏప్రిల్ 17 శ్రీరామనవమి...ఈ ఏడాది నవమికి మరింత ప్రత్యేకత ఏంటంటే...తన జన్మభూమి అయోధ్యలో శ్రీరామ చంద్రుడు కొలువుతీరిన తర్వాత వచ్చిన మొదటి శ్రీరామ నవమి. వేల సంవత్సరాలకు పైగా చెక్కుచెదరకుండా నిర్మించిన అయోధ్య ఆలయంలో అడుగడుగునా ప్రత్యేకతలే. అందులో ఒకటి సూర్య తిలకం.  శ్రీరామనవమి రోజు గర్భగుడిలో ఉండే రాముడి నుదుట సూర్య కిరణాలు ప్రసరించేలా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశారు. 

శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో ఒక అద్భుతం చోటు చేసుకోనుంది. గర్భగుడిలో ఉన్న శ్రీరాముడి విగ్రహం నుదిటిపై సూర్యూడి కిరాణాలు ప్రసరించేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. కోట్లాది మంది హిందువుల కల సాకారమవుతున్న వేళ అయోధ్య మందిరంలో ఏర్పాటు చేస్తున్న సూర్య తిలకం విశిష్టతలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.ఆయోధ్యలో నిర్మితమైన రామమందిరంలో తొలిసారి శ్రీరామ నవమి ఉత్సవాలు జరగనున్నాయి.  500 సంవత్సరాల తర్వాత ఆయన జన్మస్థలమైన అయోధ్యలో ఈ ఏడాది రామనవమి వేడుకలు నిర్వహించేందుకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏప్రిల్ 17న మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలు రాముని నుదుటిపై 75 MM వ్యాసార్థంలో వృత్తాకార తిలకంలా 6 నిమిషాల పాటు ప్రకాశించనున్నాయి. శ్రీరామనవమి రోజు ఆలయాన్ని దర్శించే భక్తులు ఈ అరుదైన ఘట్టాన్ని వీక్షించే అవకాశం లభిస్తుంది. నవమి రోజు శ్రీరాముడికి సూర్య తిలకం పడేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికి సంబంధించి  ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. శ్రీరామనవమి రోజు సూర్యుడి కిరణాలు నేరుగా రామ్ లల్లా విగ్రహం నుదుటి మీద పడేలాగా ఏర్పాటు చేశారు. లెన్స్ ప్రత్యేక అద్దాల సహాయంతో ఈ ప్రత్యేక వ్యవస్థ రూపొందించి సూర్య తిలకం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ట్రస్ట్ అధికారులు వెల్లడించారు. శ్రీరామనవమి రోజు మాత్రమే ఈ అద్భుతం జరుగుతుంది.

శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఈ ప్రక్రియ మొదలు కాబోతుంది. సుమారు ఆరు నిమిషాల పాటు గర్భగుడిలోని శ్రీరాముని విగ్రహం నుదుటి మీద సూర్యకిరణాలు పడేలాగా ఏర్పాట్లు చేశారు. ఈ టెక్నాలజీని సీఎస్ఐఆర్ ఆధ్వర్యంలో సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రూపొందించింది.  దీనికి సంబంధించి ట్రయల్ రన్ నిర్వహించారు. పరిశోధకుల కృషి ఫలించి సరిగా శ్రీరాముడి నుదుటి మీద సూర్యకిరణాలు పడ్డాయి. ఈ విషయాన్ని పరిశోధకుల బృందం, ఆలయ ట్రస్ట్ అధికారులు  ధ్రువీకరించారు.