చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం మల్లన్న ఆలయం మూసివేత...

చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం మల్లన్న ఆలయం మూసివేత...

ఆదివారం ( సెప్టెంబర్ 7 ) చంద్రగ్రహణం కారణంగా దేశవ్యాప్తంగా ఆలయాలు మూతపడ్డాయి. ఈ క్రమంలో ఏపీలోని నంద్యాల జిల్లాలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రం  శ్రీశైలం మల్లన్న ఆలయం మూసివేశారు. శ్రీస్వామి, అమ్మవారి ఉభయ దేవాలయాలు, పరివార ఆలయ ద్వారాలను మూసివేశారు. 

తిరిగి సోమవారం ( సెప్టెంబర్ 8 ) తెల్లవారుజామున 5 గంటలకు ద్వారాలు తెరిచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ చేయనున్నట్లు తెలిపారు అధికారులు.

ఇవాళ ఉదయం 7:30 గంటల నుంచి భక్తులకు శ్రీస్వామివారి అలంకార దర్శనానికి అనుమతిచ్చారు.ఈరోజు అన్ని ఆర్జిత,శాశ్వత,పరోక్షసేవలు నిలిపేసినట్లు తెలిపారు అధికారులు.గ్రహణం కారణంగా మద్యాహ్నం 12:30 వరకు మాత్రమే భక్తుల అన్నప్రసాద వితరణ నిర్వహించారు.

ఈరోజు ( సెప్టెంబర్​ 7) రాత్రికి ఏర్పడే చంద్రగ్రహణం చాలా శక్తి వంతమైనది. గ్రహణం కేవలం 3 గంటల 28 నిమిషాలు మాత్రమే ఉన్నా... ఈ ప్రభావం 40 రోజుల వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు.   ప్రతి ఒక్కరు కూడా గ్రహణ నియమాలు పాటించాలి. అనుష్టానం .. జపాలు చేసే వారు కచ్చితంగా పట్టు స్నానం.. విడుపు స్నానం చేయాలి.  ఆహార నియమాలు పాటించాలి.
 
రాత్రి సమయంలో గ్రహణం ఏర్పడుతుంది కావున.. అందరూ పడుకోవాలి. దంపతులు సంసారిక వ్యవహారాలకు దూరంగా ఉండాలని పండితులు చెబుతున్నారు.  రేపు ( సెప్టెంబర్​ 8) ఇంటిని నీటితో కచ్చితంగా శుద్ది చేసుకోవాలి. గంగా జలం కాని.. పుణ్య నదులు వాటర్​ గాని చల్లాలి. ఇవన్నీ అందుబాటులొ లేకపోతే.. ఇంటిని శుద్ది చేసిన తరువాత.. ఇంట్లో ప్రతిమూల పసుపు నీళ్లు చల్లుకోవాలి.  ఆ తరువాతే స్టవ్​ వెలిగించాలి.