కార్తీక మాసంలో శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం రూ.30.89 కోట్లు

కార్తీక మాసంలో శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం రూ.30.89 కోట్లు

శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం రికార్డ్ స్థాయిలో వచ్చింది. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 23 వరకు జరిగిన  కార్తీకమాసోత్సవాల సందర్భంగా హుండీ ఆదాయం భారీగా వచ్చింది. కార్తీకమాసంలో  మొత్తం 30కోట్ల 89లక్షల 27వేల 503 రూపాయల ఆదాయం వచ్చింది.

గత సంవత్సరం కంటే 11కోట్ల, 2లక్షల,73వేల,725 రూపాయల ఎక్కువ ఆదయం వచ్చిందని ఆలయ ఈవో తెలిపారు. ఈ ఆదాయం మొత్తం దర్శనం టికెట్లు, ఆర్జిత సేవలు, లడ్డు ప్రసాదాలు, టోల్‌గేట్‌, విభూది,  కంకణాలు,  తులాభారం, కేశఖండన,ఆన్‌లైన్‌ సేవలు, హుండీ ఆదాయం, పలు  పథకాల ద్వారా వచ్చినట్లు ఈవో తెలిపారు