పారిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు శ్రీశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దూరం

పారిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు శ్రీశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దూరం

న్యూఢిల్లీ: పారిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రిపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఇండియా అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బృందానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జంపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మురళీ శ్రీశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోకాలి గాయంతో మెగా ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దూరమయ్యాడు. ఈ నెల 27, మే 10న జరిగే డైమండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొదలుపెట్టిన శ్రీశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోకాలి నొప్పితో ఇబ్బందిపడ్డాడు. దీంతో అన్ని పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు సర్జరీ అవసరమని తేల్చారు.

ఫలితంగా ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ఈ ఏడాది జరిగే ఏ పోటీలోనూ శ్రీశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బరిలోకి దిగే చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేదు. ‘అనుకోకుండా నా మోకాలికి ఇంజ్యురీ అయ్యింది. సర్జరీ తప్పదని డాక్టర్లు చెప్పారు. దాంతో నా ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కల ముగిసింది. దురదృష్టవశాత్తు ఇదో పీడకలగా అనిపిస్తున్నది’ అని శ్రీశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నాడు. గతేడాది జరిగిన ఆసియా అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సిల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధించిన శ్రీశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పారిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు క్వాలిఫై అయ్యాడు.