బ్యాడ్మింటన్ డబుల్ చాంపియన్ గా శ్రీవైభవి జట్టు

బ్యాడ్మింటన్ డబుల్ చాంపియన్ గా శ్రీవైభవి జట్టు

నిర్మల్, వెలుగు : ఈనెల 2 నుంచి 7 వరకు ముంబైలో జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ ర్యాంకింగ్ టోర్నమెంట్ నిర్వహించారు. బ్యాడ్మింటన్​ డబుల్స్ విభాగంలో నిర్మల్​పట్టణానికి చెందిన అనుముల వైభవి జట్టు ఛాంపియన్ గా నిలిచింది. స్థానిక బుధవార్ పేట్ కు చెందిన అనుముల అమర్ కుమార్ –లావణ్య దంపతుల కూతురు శ్రీవైభవి స్థానిక రవి హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతోంది. 

ఇప్పటికే అనేక రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో విజేతగా నిలిచిన శ్రీవైభవి ముంబైలో జరిగిన అండర్ –13 నేషనల్ లెవెల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చింది. ఈ సందర్భంగా శ్రీవైభవిని రవి హైస్కూల్ కరస్పాండెంట్ వెంకటేశ్వర్ రావు, ప్రిన్సిపాల్ రాణి, టీచర్లు అభినందించారు.