తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. 9 రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు

తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. 9 రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు

తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. మాడవీధులలో గ్యాలరీలో 2 లక్షల మంది భక్తులు ప్రత్యక్షంగా వీక్షించేలా ఏర్పాట్లు చేశామన్న ధర్మారెడ్డి.. బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులు పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామన్నారు.

 ఆన్‌లైన్‌లో లక్షా 30 వేల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేశామని..ప్రతి నిత్యం సర్వదర్శనం భక్తులకు 24 వేల ఉచిత దర్శన టికెట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు ఈవో ధర్మారెడ్డి. అన్నప్రసాద సముదాయంలో నిత్యం లక్ష మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగేలా ఏర్పాట్లు చేశామన్నారు. 

బ్రహ్మోత్సవాల సందర్భంగా 3వేల500 మంది పోలీసులు, 1200 మంది విజిలెన్స్ సిబ్బందితో భధ్రతా ఏర్పాట్లు చేశామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు.