రామ్ చరణ్పై షారుక్ ఖాన్ ట్వీట్

రామ్ చరణ్పై షారుక్ ఖాన్ ట్వీట్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ తన అభిమానాన్ని చాటుకున్నాడు.  షారుక్ ఖాన్ తాజాగా నటించిన చిత్రం  ‘పఠాన్’. ఈమూవీ ఈనెల 25న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.  ఈ క్రమంలో షారుక్ ఖాన్ ట్విట్టర్ చాట్ సెషన్ నిర్వహించాడు. ఈ సందర్భంగా ‘పఠాన్’ సినిమా విడుదల రోజు తెలుగు రాష్ట్రాలలో ఏదైనా థియేటర్ ను సందర్శించే అవకాశం ఉందా అని ఒ నెటిజన్ అడగగా.. షారుక్ ఖాన్ దానికి ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. వాటిలో రాంచరణ్ కనుక నన్ను ఏదైనా థియేటర్ కి తీసుకువెళ్తే అప్పుడు నేను థియేటర్లను సందర్శిస్తానని పేర్కొన్నాడు.

దీంతో షారూఖ్ చరణ్ పేరు ప్రస్తావించడంతో ఆయన అభిమానులు ఖుషీ అయ్యారు. కాగా, ఈ నెల 10న ‘ప‌ఠాన్’ తెలుగు వెర్షన్ ట్రైల‌ర్‌ను రామ్ చ‌ర‌ణ్  సోష‌ల్ మీడియా ద్వారా విడుద‌ల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి  బెస్టాఫ్ లక్ చెప్పారు. దీనికి కృతజ్ఞతలు తెలిపిన షారుఖ్.. ‘మీ ఆర్ఆర్‌ఆర్ టీమ్‌ ఇండియాకు ఆస్కార్‌ను తీసుకొచ్చినప్పుడు దయచేసి దానిని టచ్‌ చేయనివ్వండి’ అని అన్నారు. షారుఖ్ దీన్ని ఇంగ్లిష్‌తో పాటు తెలుగులోనూ ట్వీట్ చేయడం విశేషం. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాను పాన్  ఇండియా లెవెల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.