సూపర్ స్టార్ మహేశ్ బాబు , దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్- అడ్వెంచర్ చిత్రం టైటిల్‌ను ఇటీవల ప్రకటించారు. ఎన్నో రోజులుగా అభిమానులు, సినీ ప్రపంచం ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు 'వారణాసి' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ టైటిల్ రివీల్‌ను కూడా రాజమౌళి తనదైన శైలిలో భారీ ఎత్తున నిర్వహించి, అంచనాలను మరింత పెంచేశారు.
గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్
సినిమా టైటిల్‌ను ప్రకటించడానికి రాజమౌళి అండ్ టీమ్ 'గ్లోబ్‌ట్రాటర్' (Globe Trotter Event) పేరుతో రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక మెగా ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ గ్రాండ్ ఈవెంట్‌కు వేల సంఖ్యలో మహేశ్ బాబు అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. గ్లింప్స్‌లో చూపించిన విజువల్స్, మహేశ్ బాబు లుక్ అద్భుతంగా ఉన్నాయంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
మహేశ్ ఎంట్రీ.. వెనుక కష్టం
ఈ ఈవెంట్‌లో హీరో మహేశ్ బాబు ఎంట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రిన్స్.. ఎద్దుపై కూర్చుని స్టేజ్ మీదకు ఎంట్రీ ఇవ్వడం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. పౌరాణిక, అడ్వెంచర్ నేపథ్యాన్ని సూచించే ఈ ఎంట్రీకి థియేటర్లో అభిమానుల నుంచి ఎలా స్పందన వస్తుందో ఊహించుకోవచ్చు. అయితే, ఈ విజువల్‌ను క్రియేట్ చేయడానికి మేకర్స్ ఎంత కష్టపడ్డారో తెలుపుతూ లేటెస్ట్ గా ఒక మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. వృషభం బొమ్మను రూపొందించడం, దానిని కదిలేలా చేయడం, ఆపై మహేశ్ బాబును దానిపై కూర్చోబెట్టి గ్రాండ్‌గా ఎంట్రీని డిజైన్ చేసిన విధానం.. రాజమౌళి టీమ్ డెడికేషన్‌ను తెలియజేస్తోంది. ఈ మేకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు "జక్కన్న సూపర్" అంటూ ప్రశంసిస్తున్నారు.
ప్యాన్-వరల్డ్ స్థాయిలో కాస్టింగ్..
ఈ ప్యాన్-వరల్డ్ చిత్రంలో మహేశ్ బాబుతో పాటు బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషించనుంది.. అలాగే, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా కనిపించనున్నారు.. ఈ కాస్టింగ్ తో పాటు పలువురు స్టార్ లు దీనిలో నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను కేవలం భారతదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువ చేయాలనేది రాజమౌళి లక్ష్యంగా ఉన్నారు.. ప్రముఖ నిర్మాత కె.ఎల్. నారాయణన్ ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.
ఈ'వారణాసి' సినిమా షూటింగ్ తదుపరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది.. ఈ యాక్షన్ అడ్వెంచర్ కథాంశం భారతదేశంలోని పురాతన సంస్కృతి, అడ్వెంచర్ అంశాలతో కూడిన 'ఇండియానా జోన్స్' తరహాలో ఉంటుందని తెలుస్తోంది. రాజమౌళి మేకింగ్‌లో మహేశ్ బాబు నటన ఏ స్థాయిలో ఉంటుందో చూడటానికి అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
