OG Poster: ఆ నిప్పు సెగలు చూశారా..పవర్ స్టార్ ఓజీ పోస్టర్ అదిరింది

OG Poster: ఆ నిప్పు సెగలు చూశారా..పవర్ స్టార్ ఓజీ పోస్టర్ అదిరింది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా చేస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఓజీ (OG). టాలీవుడ్ స్టైలీష్ డైరెక్టర్ సుజిత్ (Sujeeth) తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. పవన్ నుండి వస్తున్న సినిమాల్లో ఓజీ సినిమాకు సెపరేట్ క్రేజ్ ఏర్పడింది. దానికి కారణం ఈ సినిమాలో పవన్ మొదటిసారి గ్యాంగ్ స్టార్గా కనిపించనున్నారు. అందుకే ఈ సినిమా నుండి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో ట్రేండింగ్ లోకి వస్తోంది. 

లేటెస్ట్గా ఈ మూవీ నుండి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (SS Thaman) తన ట్విట్టర్ X ఖాతాలో షేర్ చేసిన ఓజీ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఈ పోస్టర్ లో పవర్ స్టార్ వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంటు ధరించి..రక్తపు ధారలు ఉన్న కత్తితో..రక్తంతో తడిసిన షర్ట్..ఆ కళ్ళల్లో నిప్పు సెగలు..ఇలా ఒక పోస్టర్ తోనే గూస్ బంప్స్ అనే విధంగా ఉంది. దీంతో ఈ పోస్టర్ తెగ వైరల్ అవుతోంది. ఇది కదా మనకు కావాల్సిన స్టఫ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తూనే..ఓజీ అదిరిపోవాలంటూ మేకర్స్ ని రిక్వెస్ట్ పెడుతున్నారు. ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్‌ 27 న రిలీజ్ కాబోతుంది. 

ప్రొడ్యూసర్ DVV దానయ్య  నిర్మిస్తున్న ఈ మూవీలో పవన్కు జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తుండగా..తమిళ నటుడు అర్జున్ దాస్ (Arjun Das), శ్రియ రెడ్డి (Shreya Reddy), ప్రకాష్ రాజ్(Prakash Ra) ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) విలన్గా నటిస్తున్నాడు.