తల్లి గర్భంలోనే శిశువు తల వదిలేసిన ఆరోగ్య సిబ్బంది

తల్లి గర్భంలోనే శిశువు తల వదిలేసిన ఆరోగ్య సిబ్బంది

గ్రామీణ ఆరోగ్య కేంద్రం సిబ్బంది నిర్లక్ష్యం.. ఓ తల్లిని మరణం చివరి అంచుల వరకూ తీసుకెళ్లింది.  నవజాత శిశువు తలను వేరు చేసి.. దాన్ని ఆ  తల్లి కడుపులో ఉంచిన ఘటన , పాక్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో  జరిగింది. దీంతో ఆ మహిళ ప్రాణాపాయ స్థితిని ఎదుర్కోవల్సి వచ్చింది. తార్పార్కర్ జిల్లాకు చెందిన ఓ మహిళ, మొదట తమకు దగ్గర్లోని గ్రామీణ ఆరోగ్య కేంద్రానికి (RHC) వెళ్ళింది. కానీ అక్కడ మహిళా గైనకాలజిస్ట్ గానీ, సరైన సదుపాయాలు గానీ అందుబాటులో లేకపోవడంతో, ఏ మాత్రం అనుభవం కూడా లేని సిబ్బంది ఆమెను అపాయమైన స్థితికి తీసుకువచ్చారు. ఆర్‌హెచ్‌సి సిబ్బంది.. ఆ మహిళకు శస్త్రచికిత్సకు చేసి తల్లి కడుపులోనే ఆ శిశువు తలను ఉంచారు. దీంతో ఆమె కండీషన్ క్రిటికల్ గా మారేసరికి ఆమె కుటుంబసభ్యులు సమీపంలో ఉన్న మరొక ఆసుపత్రికి చేర్చారు. అక్కడ ఆ తల్లి గర్భం నుండి శిశువును బయటకు తీసి, మొత్తానికి ఆ తల్లి ప్రాణాలు కాపాడారు వైద్యులు. పాప తల లోపలే చిక్కుకుపోయిందని, దీంతో తల్లి గర్భాశయం ఛిద్రమైందని, శస్త్రచికిత్స చేసి ఆమె పొత్తికడుపును తెరిచి తలను బయటకు తీయాల్సి వచ్చిందని అక్కడి డాక్టర్లు తెలిపారు. ఈ కేసుపై ఇప్పటికే విచారణ కూడా మొదలైనట్టు సమాచారం.