
తమిళనాడుకు కాబోయే సీఎం ఎంకే స్టాలినేనన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఇవాళ ఆయన కృష్టగిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడారు. తమిళనాడుకు స్టాలిన్ ముఖ్యమంత్రి కాబోతున్నారని జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్-డిఎంకే కలిసి పోటీ చేస్తున్నాయని తెలిపారు. తమిళనాడులో 39, పుదుచ్చేరిలో 1 లోక్‌సభ స్థానం ఉంది. మొత్తం 40 సీట్లలో కాంగ్రెస్ 10 స్థానాల్లో (తమిళనాడు 9, పుదుచ్చేరి 1) పోటీ చేస్తుంది. మిగిలిన 30 స్థానాల్లో డిఎంకే తమ అభ్యర్ధులను బరిలోకి దింపింది. అన్నాడిఎంకే, బీజేపీ, పిఎంకే కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయి. మొత్తం 40 ఎంపీ స్థానాల్లో బీజేపీ 5, పిఎంకే 6 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. మిగిలిన 29 స్థానాల్లో అన్నాడిఎంకే పోటీ చేస్తోంది.