ష్.. అంతా గప్చుప్..!...మూడు కమిష నరేట్లలో స్టాండింగ్ కమిటీ మీటింగ్లు..వివరాలు బయటకు చెప్పని అధికారులు

ష్.. అంతా గప్చుప్..!...మూడు కమిష నరేట్లలో స్టాండింగ్ కమిటీ మీటింగ్లు..వివరాలు బయటకు చెప్పని అధికారులు

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీల్లో సోమ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశాల వివరాలను అధికారులు గోప్యంగా ఉంచారు. ఇప్పటివరకూ జరిగిన సమావేశాల్లో ఆమోదించిన అంశాలను ప్రజలకు వెల్లడించేవారు. కానీ, ఈసారి ఎందుకో అధికారులు గోప్యంగా ఉంచడం చర్చనీయాంశమైంది. సోమ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వారం మూడు కార్పొరేష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్లలో జ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిగిన స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మావేశాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు స్పెష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్ ఆఫీస‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ జ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యేశ్ రంజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్ అధ్యక్షత వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హించారు. ఈ మీటింగ్​తర్వాత ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. 

కాగా, ఎంఎంసీ ఆఫీసులో జరిగిన స్టాండింగ్ కమిటీ మీటింగ్​లో  37 అంశాలపై  చర్చించినట్లు తెలిసింది.  తర్వాత 99 రోజుల కార్యాచరణ ప్రజా పాలన ప్రగతి– ప్రణాళిక అమలు చేస్తున్న విధానాలపై  సమీక్షా సమావేశం నిర్వహించారు. యాంటీ లార్వా ఆపరేషన్స్ కింద  ఫాగింగ్ డ్రైవ్స్, చెరువుల్లో  ఆయిల్ బాల్స్ వినియోగం, స్ప్రేయింగ్ కార్యక్రమాలు చేపట్టి దోమలను నివారించాలన్నారు. సీజనల్ వ్యాధులను నివారించడం పై ప్రత్యేకంగా చర్చించారు.