
న్యూఢిల్లీ: తమ కస్టమర్లకు ఏఐ ఆధారిత క్లెయిమ్ సెటిల్‌మెంట్ సేవలను అందించేందుకు స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ, మీడియా అసిస్ట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా స్టార్ హెల్త్ మ్యాట్రిక్స్ అనే అడ్వాన్స్‌డ్ ఏఐ ఆధారిత క్లెయిమ్స్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తేనుంది. పెరుగుతున్న క్లెయిలను వేగంగా, నిలకడగా, పారదర్శకంగా నిర్వహించడానికి ఈ ప్లాట్‌ఫామ్ సాయపడుతుందని, మాన్యువల్ ప్రాసెస్‌లను తగ్గిస్తుందని, పని వేగంగా జరిగేలా చూస్తుందని కంపెనీ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది.
స్టార్ హెల్త్ ఎండీ, సీఈఓ ఆనంద్ రాయ్ మాట్లాడుతూ, క్లెయిమ్స్ మేనేజ్‌మెంట్ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో ఇది పెద్ద అడుగు అని అన్నారు. ఇదిలా ఉంటే స్టార్హెల్త్లో తనకు ఉన్న 2.84 శాతం వాటాను రూ.701 కోట్లకు అమ్మినట్టు డబ్ల్యూఎం ఏసియా బుధవారం ప్రకటించింది. ఒక్కో షేరును రూ.420 చొప్పున విక్రయించింది.