Onam Celebrations: ఓనం వేడుకల్లో తారల మెరుపులు.. "మీ దత్తపుత్రుడు" అల్లు అర్జున్ బెస్ట్ విష్!

Onam Celebrations: ఓనం వేడుకల్లో తారల మెరుపులు.. "మీ దత్తపుత్రుడు" అల్లు అర్జున్ బెస్ట్ విష్!

కేరళలో అత్యంత వైభవంగా జరుపుకునే సంస్కృతిక పండుగ ఓనం. ప్రకృతి అందాల మధ్య, సంప్రదాయాల పరిమళాలు వెదజల్లుతూ మూడు రోజుల పాటు వేడుకలా జరుపుకుంటారు. ఈ పండుగలో కుల, మత, వయస్సుతో సంబంధం లేకుండా అందరూ కలిసి ఆనందంగా పాల్గొంటారు. తెల్లవారుజాము నుంచే కేరళలోని ప్రతీ ఇల్లు సందడిగా మారిపోయింది. మహిళలు, చిన్నారులు సంప్రదాయ దుస్తులు ధరించి ఇంటి ముందు రంగురంగుల పూలతో 'పూక్కలం' వేశారు. తమ అభిమాన రాజు మహాబలిని ఆహ్వానించేందుకు ఈ పూల రంగవల్లులను సిద్ధం చేశారు. ఆలయాలు, బహిరంగ ప్రదేశాలు, షాపింగ్ సెంటర్లు పూలు, దీపాలతో అలంకరించబడి పండుగ వాతావరణాన్ని మరింత పెంచాయి.

ఓనం పండుగ కేవలం వేడుక మాత్రమే కాదు, ప్రేమ, సంతోషం, సామరస్యం, శాంతికి ప్రతీక. ప్రజలందరి జీవితాల్లో కొత్త ఆరంభాలను, సంపదను, సుఖ సంతోషాలను ఓనం తీసుకొస్తుందని ప్రజలు బలంగా నమ్ముతారు. పూల రంగవల్లులు, రుచికరమైన ఓనం సద్య (విందు) ఎప్పటికీ మరచిపోలేని ఆనందాన్ని ఇస్తాయని మలయాళీలు నమ్ముతారు. తెలుగు ప్రజలకు సంక్రాంతి ఎంత ముఖ్యమో, మలయాళీలకు ఓనం అంత ముఖ్యం.

సెలబ్రిటీల ఓనం శుభాకాంక్షలు
ఓనం పండుగ వేడుకలో సినీతారలు మునిగిపోయారు. ఈ సందర్భంగా తమ అభిమానులకు శుభాకాంక్షలు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.  వేడుకకు సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు.  ఓనం వేడుకలు కేరళ సంప్రదాయ చీరకట్టు లేకుండా అసంపూర్ణం. సంప్రదాయ చీరలు కట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చారు. తమ అభిమాన నటీమణులు అందాలను చూసి ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

►ALSO READ | శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాపై లుక్ అవుట్ నోటీసులు జారీ.. ఈడీ దర్యాప్తులో కొత్త ట్విస్ట్!

పృథ్వీరాజ్ సుకుమారన్ తన కుటుంబంతో ఓనం జరుపుకుంటున్నారు. ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో భార్య సుప్రియ మేనన్‌తో కలిసి ఉన్న ఫోటోను పంచుకున్నారు. ఈ ఫోటోలో పృథ్వీరాజ్ తెల్లటి షర్ట్, ధోతీలో కనిపించగా, సుప్రియ బంగారు అంచుతో ఉన్న చీరలో ఎంతో అందంగా కనిపించారు. "హ్యాపీ ఓనం!" అంటూ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు.

 

మరో నటి మాళవిక మోహనన్ "మీకు, మీ కుటుంబాలకు హ్యాపీ ఓనం. మీ ప్రియమైనవారితో ఎక్కువ నవ్వు, రుచికరమైన సద్య, అందమైన పూక్కలం మీకు దక్కాలని కోరుకుంటున్నాను" అని పోస్ట్ చేశారు.

 

అతుల్యా రవి "ఈ ఓనం ప్రేమ, ఆనందం, ఐక్యతను తీసుకురావాలని కోరుకుంటున్నాను. రంగుల పూక్కలాలు, రుచికరమైన సద్య మీకు అంతులేని ఆనందాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాను" అంటూ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రగ్యా జైస్వాల్ "హ్యాపీ ఓనం! ఈ పండుగ మీకు అదృష్టం, ఆనందం, శ్రేయస్సును తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను" అని పోస్ట్ చేశారు

 

మలయాళీలందరికీ హృదయపూర్వక ఓనం శుభాకాంక్షలు! ఈ ఓనం శ్రేయస్సు, శాంతితో నిండిన కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది.   "మీ దత్తపుత్రుడు (Your adopted son)"  అల్లు అర్జున్ చేసిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంది.

 

నటి కృతి శెట్టి తన కుటుంబం, స్నేహితులతో కలిసి ఓనంను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. చిన్నప్పటి నుంచి ఓనం సద్యాలో రుచికరమైన వంటలు తినడం, అమ్మతో కలిసి రంగవల్లులు వేయడం తన జీవితంలో మధురమైన జ్ఞాపకాలని ఆమె తెలిపారు. 

 

మమ్ముట్టి, మోహన్‌లాల్, దుల్కర్ సల్మాన్, శృతి రామచంద్రన్, అనుపమ పరమేశ్వరం, పార్వతి నాయర్, కీర్తి సురేష్, కళ్యాణీ ప్రియదర్శిని, సంయుక్త, మీనా, అంజు కురియన్ వంటి స్టార్స్ అందరూ సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులకు ఓనం శుభాకాంక్షలు చెప్పారు.