- ఆ రాష్ట్ర సీఎంకు వందే గోమాతరం వినతి
హైదరాబాద్, వెలుగు: గోవా నుంచే గోవుల సంరక్షణ బాధ్యత స్టార్ట్ చేయాలని ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్ సావంత్‌ను నమో వందే గోమాతరం సంస్థ కోరింది. హైదరాబాద్‌కు చెంది న నమో వందే గోమాతరం సంస్థ నేషనల్ ప్రెసిడెంట్ పెరిక సురేశ్ ఆధ్వర్యంలోని బృందం తాజాగా గోవా సీఎంను కలిసి వినతిపత్రం అందజేసింది.
ఈ సంద ర్భంగా సురేశ్ మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతికి, వారసత్వా నికి ప్రతిరూపమైన గో మాతను సంరక్షించాల్సిన అవసరం ఉందని.. అది గోవా నుంచే ప్రారంభించాలని సీఎంకు వివరించారు. దానికి సావంత్ సానుకూలంగా స్పందించా రని సురేశ్ వెల్లడించారు. నమో వందే గోమాతరం ఆధ్వర్యంలో గోవులను రక్షించే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు, అందులో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల సీఎంలను కలిసి గో హత్య నిషేధం కఠినంగా అమలు చేయాలని కోరనున్నట్లు చెప్పారు.