గుడ్ హెల్త్ : ఉదయం అర గంట వాకింగ్ చేస్తే.. ఇవన్నీ కంట్రోల్ లో ఉంటాయి

గుడ్ హెల్త్ : ఉదయం అర గంట వాకింగ్ చేస్తే.. ఇవన్నీ కంట్రోల్ లో ఉంటాయి

ఉదయపు నడక వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. దీని వల్ల మనస్సు, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. నడక.. శరీరం అంతటా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది అనేక వ్యాధులను నయం చేస్తుంది.

మార్నింగ్ వాక్ చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అనేక తీవ్రమైన శారీరక పరిస్థితులకు నడక చాలా ప్రభావవంతమైన చికిత్స. అలాగని ఒకరోజు మార్నింగ్ వాక్ చేసి మూడు రోజులు విరామం తీసుకోవడం వల్ల మేలు జరగదని గుర్తుంచుకోవాలి. రోజూ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆహారం ఎంత అవసరమో, శరీర అవయవాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాయామం, నడక తప్పనిసరి. అందుకోసం సమయం లేకపోయినా రోజూ ఉదయాన్నే 30 నిమిషాల పాటు నడవడం అలవాటు చేసుకోవడం ఉత్తమం.

 ప్రతిరోజూ ఉదయం 30 నిమిషాలు నడిస్తే, మీ శరీరంలోని అనేక తీవ్రమైన వ్యాధులను నయం చేయవచ్చు. మార్నింగ్ వాక్ వల్ల శరీరంలోని ఏ ఒక్క భాగానికి ప్రయోజనం ఉండదు, కానీ శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది.

30 నిమిషాల మార్నింగ్ వాకింగ్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

గుండె ఆరోగ్యంగా ఉంటుంది

ఉదయాన్నే నడిస్తే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

రక్తపోటు నియంత్రణ

30 నిమిషాల నడకతో అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తపోటు రోగులు ప్రతిరోజూ నడకను అలవాటుగా చేసుకుంటే మంచిది.

నడక బరువు తగ్గుతుంది

రోజూ 30 నిమిషాల పాటు నడవడం ద్వారా కూడా పెరుగుతున్న బరువును నియంత్రించుకోవచ్చు. నడవడం వల్ల కేలరీలు ఖర్చవుతాయి.

డయాబెటిస్‌లో నడక చాలా ఉపయోగకరంగా ఉంటుంది

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయం పూట కనీసం 30 నిమిషాల పాటు నడవాలి. మంచి డైట్ పాటిస్తే మరింత ప్రయోజనం ఉంటుంది.

మీరు కీళ్ల నొప్పులతో గనక ఇబ్బంది పడుతుంటే, ప్రతిరోజూ 30 నిమిషాలు నడవాలి. ఇది మీ కండరాలను బలోపేతం చేస్తుంది, కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది.