మొదలైన తొలిదశ పోలింగ్.. బారులు తీరిన ఓటర్లు

మొదలైన తొలిదశ పోలింగ్..  బారులు తీరిన ఓటర్లు

లోక్ సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ మొదలైంది.  18 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 91 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగుతోంది.  ఉదయం 7గంటలకు ప్రారంభం అయింది. సాయంత్రం 6గంటల వరకు జరగనుంది. నక్సల్ ప్రభావిత ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని చోట్ల సాయంత్రం 4గంటలకే పోలింగ్ ముగియనుంది. లోక్ సభ సీట్లతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు ఇవాళే పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఒడిశా అసెంబ్లీలోని 28 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది.

మొదటి విడతలో 91 సీట్లకు ఎన్నికలు జరుగుతుండగా… 1279 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తెలంగాణలోని నిజామాబాద్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 185 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అతి తక్కువగా నాగాలాండ్ నుంచి నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. 14 కోట్ల 21లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 7 కోట్ల 22లక్షల మంది పురుష ఓటర్లుండగా… 6 కోట్ల 98లక్షల మంది మహిళా ఓటర్లున్నారు. 7 వేల 764 మంది థర్డ్ జెండర్ ఓటర్లున్నారు. మొత్తం ఒక లక్షా 70వేల 664 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.…