మెరుగైన విద్య.. సరస్వతీ విద్యాపీఠం లక్ష్యం

మెరుగైన విద్య.. సరస్వతీ విద్యాపీఠం లక్ష్యం
  • సరస్వతి విద్యాపీఠం ఇన్‌చార్జీ నల్లాని చక్రవర్తుల కృష్ణమాచారి

బెల్లంపల్లి, వెలుగు: రాష్ట్రంలో బాలబాలికల్లో పంచకోశాత్మక విద్యను  అందించేందుకు కృషి చేస్తున్నట్లు సరస్వతి విద్యాపీఠం రాష్ట్ర అకాడమిక్ ఇన్‌చార్జి నల్లాని చక్రవర్తుల కృష్ణమాచారి అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో నిర్వహించిన 1996-- – -97 పూర్వ పదో తరగతి విద్యార్థుల సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.  తెలంగాణ రాష్ట్రంలో 170  సరస్వతి విద్యాపీఠం పాఠశాలలు పనిచేస్తున్నాయన్నారు. దేశవ్యాప్తంగా విద్యా భారతి అఖిల భారతీయ శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో 27 వేల పాఠశాలలు పనిచేస్తున్నట్లు చెప్పారు. 

కేంద్రీకృత, కృత్యాదార, అనుభవ, ఆధారిత సంస్కారయుక్తలను అమలుపరుస్తూ జాతీయ విద్యా విధానం అమలు చేస్తున్నామన్నారు. విద్యార్థులు  గురువులను శాలువాతో సన్మానించారు.  మంచిర్యాల, కుమ్రం భీం ,పెద్దపల్లి జిల్లాల అకాడమిక్ ఇన చార్జి పూదరి సత్యనారాయణ, స్థానిక పాఠశాల సెక్రటరీ కొడిప్యాక విద్యాసాగర్, నాటి పూర్వ విద్యార్థులు కమల్ లాహోటి, గరికే వేణుగోపాల్, బొడ్డు వెంకటేశ్వర్లు, జక్కుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.