సఫాయి కార్మికుల సేవలు వెలకట్టలేనివి : కోదండ రెడ్డి

సఫాయి కార్మికుల సేవలు వెలకట్టలేనివి : కోదండ రెడ్డి
  • రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్  కోదండ రెడ్డి

శివ్వంపేట, వెలుగు: సఫాయి కార్మికుల సేవలు వెల కట్టలేనివని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి అన్నారు. శుక్రవారం శివ్వంపేట  రైతు వేదికలో కృషి విజ్ఞాన గ్రామీణ అభివృద్ధి స్వచ్ఛంద సంస్థ చైర్మన్ లక్ష్మీ కాంతం ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ కార్మికులకు సన్మాన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు.

 గతంలో భూముల రిజిస్ట్రేషన్ జరిగినపుడు కొంత మొత్తం పంచాయతీలకు అందేదని గుర్తు చేశారు. ఐఏఎస్, ఐపీసీఎస్ ఆఫీసర్లకు ఒక నెల జీతం లేట్ అయినా సర్దుకోగలుగుతారు,  కానీ సఫాయి కార్మికుల కు జీతాలు రాకుంటే పరిస్థితి దారుణంగా ఉంటుందన్నారు. కార్మికులు  గ్రామాల్లో చేసే సేవలు చాలా గొప్ప వని కొనియాడారు. నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్​చార్జి రాజిరెడ్డి మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నిధులు,  కార్మికులకు జీతాలు ఇచ్చేదన్నారు.

 గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలలో నిధులు లేకుండా చేసిందన్నారు. త్వరలో గ్రామ పంచాయతీ కార్మికులకు నెలనెలా జీతాలు వచ్చే విధంగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ నాయకులు నవీన్ గుప్తా, సొసైటీ  చైర్మన్ వెంకటరామిరెడ్డి, నాయకులు సుధీర్ రెడ్డి, గణేశ్, అరుణ్ కుమార్, ప్రభు లింగం గౌడ్, శ్రీనివాస్, రాజు యాదవ్ పాల్గొన్నారు