గవర్నర్ తమిళిసైని కలిసిన రాష్ట్ర బీజేపీ నేతలు

గవర్నర్ తమిళిసైని కలిసిన రాష్ట్ర బీజేపీ నేతలు

పంజాబ్ లో ప్రధాని కాన్వాయ్ అడ్డగించడంపై విచారణ జరపాలంటూ గవర్నర్ తమిళిసైకి వినతిపత్రం ఇచ్చారు రాష్ట్ర బీజేపీ నేతలు. బాధ్యులపై చర్యలు తీసుకునేలా రాష్ట్రపతికి నివేదించాలని గవర్నర్ ను కోరారు. పంజాబ్ ఎన్నికల్లో గెలిచే సత్తా లేక.. కాంగ్రస్ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్. ఈ ఘటనపై కేటీఆర్ కామెంట్స్ ను తప్పుపట్టారు. రైతుల ముసుగులో కాంగ్రెస్ మోదీ రక్షణపై కుట్ర పన్నిందన్నారు. ప్రధాని రక్షణపై హేళనగా మాట్లాడిన మంత్రి కేటీఆర్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. కాంగ్రెస్ కు తోక పార్టీగా టీఆర్ఎస్ మారిందన్నారు. ప్రధాని మోడీ క్షేమం కోరుతూ  ఈ నెల 10న రాష్ట్ర వ్యాప్తంగా మృత్యుంజయ హోమాలు నిర్వహిస్తామన్నారు. అల్కాపురి టెంపుల్ లో  బండి సంజయ్ యాగం చేయనున్నారు.  దేశ వ్యాప్తంగా బీజేపీ చేపడుతున్న యాగాల్లో భాగంగా తెలంగాణలో కూడా బీజేపీ ఈ యాగం చేస్తుందన్నారు.

సభలో ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించిన రైతు

 

ఐదు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా

పెళ్లి కూతురి డ్యాన్స్కు నెటిజన్స్ ఫిదా