
- స్టేట్ చీఫ్ కమిషనర్ డాక్టర్ జి. చంద్రశేఖర్ రెడ్డి
రాజన్న సిరిసిల్ల, వెలుగు: జిల్లాలో సమాచార హక్కు చట్టంను అధికారులు కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన సమాచార హక్కు చీఫ్ కమిషనర్ జి. చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. మంగళవారం సిరిసిల్ల కలెక్టరేట్‌లో ఆఫీసర్లకు ఆర్టీఐ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండేండ్ల పాటు ఆర్టీఐ కమిషనర్ లేకపోవడంతో 17 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
ప్రతి ప్రభుత్వ ఆఫీస్‌లో ప్రజా సమాచార అధికారి, మొదటి అప్పిలేట్ అథారిటీ, రెండో అప్పిలేట్ అథారిటీ పేర్లు, ఫోన్ నంబర్లతో బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ సందీప్కుమార్ఝా మాట్లాడుతూ 2005లో వచ్చిన సమాచార హక్కు చట్టం కారణంగా ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగిందన్నారు. మండల స్థాయిలో సహచట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సహ కమిషనర్లు భూపాల్, పీవీ శ్రీనివాస రావు, అయోధ్యరెడ్డి, మెహసిన పర్వీన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.