త్యాగాల ఫలితమే నేటి సమరసత భారతం : ప్రసాద్

త్యాగాల ఫలితమే నేటి సమరసత భారతం : ప్రసాద్

సిద్దిపేట రూరల్, వెలుగు: భారతదేశంలోని ప్రజల్లో ఎన్ని వైవిధ్యాలున్నప్పటికీ అందరూ ఏకాత్మాతో జీవించాలన్న ఆలోచనతో ఎంతోమంది తమ ప్రాణాలను ధారపోశారని సామాజిక సమరసత రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్,  కవి, రచయిత భాస్కర్ యోగి అన్నారు. శనివారం రాత్రి సిద్దిపేట పట్టణంలోని అంబిటస్ స్కూల్ లో జరిగిన 'సమత్వ సాధనలో సౌజన్య మూర్తులు' అనే పుస్తక ఆవిష్కరణలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు.  

అన్ని కులాల్లో మహనీయులు జన్మించి, ప్రజలను ఆధ్యాత్మిక మార్గంలో నడిపించేందుకు కృషి చేశారన్నారు. వేల సంవత్సరాల క్రితమే దేశమంతా పర్యటన చేసిన శ్రీరాముడు,  శ్రీకృష్ణుడు సమరసత కోసం పాటుపడ్డారని తెలిపారు. దేశ సమగ్రత, సార్వభౌమత్వం కాపాడాలన్న అంశాన్ని రాజ్యాంగ పీఠికలో  పొందుపరచి దేశభక్తిని చాటుకున్న రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్  గొప్పవాడని కొనియాడారు. కార్యక్రమంలో సామాజిక సమరసత వేదిక జిల్లా అధ్యక్షుడు ఉప్పరి రత్నం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరేశ్ బాబు, సమరసత వేదిక రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్ రుక్మిణి, జిల్లా గౌరవ అధ్యక్షుడు అరవింద్, జిల్లా కన్వీనర్ రమేశ్, జిల్లా ఉపాధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, దశరథం, బాలయ్య, సంతోష్,  మల్లారెడ్డి, సుమన్,  ట్రస్మా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.