ఉపాధి కూలీలకు...సమ్మర్​ అలవెన్స్​ ఇయ్యట్లే

ఉపాధి కూలీలకు...సమ్మర్​ అలవెన్స్​ ఇయ్యట్లే
  •  దినసరి వేతనంతోనే సరిపెడ్తున్న రాష్ట్ర సర్కార్​
  •  పని  ప్రదేశాల్లో వసతులు లేక ఇక్కట్లు

నల్గొండ, వెలుగు: ఉపాధి హామీ పథకం కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం వేసవి భృతి ఆపేసింది. వేసవిలో పనులు చేయడానికి కూలీలు మరింత కష్టపడుతుంటారు. వీరికి  కేంద్రం చెల్లించే దినసరి వేతనంతోపాటు, ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం సమ్మర్​  లో అలవెన్స్​ ఇవ్వాలి. కానీ ఈ ఏడాది నుంచి సమ్మర్​ అలవెన్స్ ఆపేసి,  కేంద్రం ఇచ్చే  వేతనంతోనే  సరిపెడ్తోంది. దీంతో ఉపాధి పనులకు వచ్చేందుకు కూలీలు అంతగా ఆసక్తి చూపడం లేదు. పై నుంచి మాత్రం టార్గెట్​ మేరకు కూలీలను పనులకు రప్పించాలనే ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. కానీ కూలీలకు పని జరుగుతున్న ప్రదేశాల్లో సరియైన వసతులు కల్పించకపోవడం, వేసవి భృతి చెల్లించకపో వడంతో ఆశించిన స్థాయిలో లేబర్​ హాజరు నమోదు కావడం లేదు. కూలీల మీద ఎంత ఒత్తిడి పెంచినా గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం వస్తున్న కూలీ ల హాజరు తక్కువగానే ఉంటోంది.

నష్టపోతున్న కూలీలు...

ప్రస్తుతం జిల్లాలో రోజుకు 85 వేల మంది కూలీలు ఉపాధి పనులకు వస్తున్నారు. ప్రతిరోజు రూ.150లకు మించి కూలీ గిట్టుబాటు కావట్లేదు. గతం లో ఇదే సీజన్​లో సమ్మర్​ అలవెన్స్ కింద 30 శాతం అధనంగా ప్రభుత్వం చెల్లించేది. దీంతో సగటు వేతనం రెండొందల వరకు గిట్టుబాటు అయ్యేది. కానీ ఇప్పుడు కేవలం రూ.150 వస్తుండటంతో  కూలీలు పనిచేయడానికి ముందుకు రావట్లేదు. పనులు జరిగే  ప్రాంతాల్లో కనీస మౌలిక వసతులు కల్పించాల్సిన ప్రభుత్వం వాటి ని గాలికి వదిలేసింది. కనీసం తాగేందుకు నీళ్లు కూడా ఉండడం లేదని  కూలీ లు చెపుతున్నారు. జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు చేరాయి. ఈ పరిస్థితుల్లో కూలీలు మిట్టమధ్యాహ్నాం విశ్రాంతి తీసుకునేందుకు కనీసం టెంట్లు కూడా ఏర్పాటు చేయలేదు. 

గడ్డపారలు..పారలు...తట్టలు పాతవే...

కూలీలకు గడ్డపారలు, పారలు, తట్టలు సప్లై చేసి దాదాపు 20 ఏళ్లు కావొస్తోంది. అప్పుడిచ్చిన గడ్డపారలు, పారలు, తట్టలతోనే పనులు చేస్తున్నా రు. కనీసం గడ్డపారలు, పారలను సాన పెట్టేందుకు పైసలు కూడా ఇవ్వడం లేదు. ప్రభుత్వం ఇస్తున్న రూ.150ల కూలీతోనే వసతులు కల్పించుకోవాల్సి వస్తుందని కూలీలు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. పని ముట్లు పాత పడ్డాయని, కొత్త వాటిని సప్లై చేయాలని సర్కార్​కు ప్రపోజల్​ పంపినా ఎలాంటి రిప్లై రాలేదు. 

రోజుకు 99 మంది కూలీలే హాజరు..

ఉపాధి పథకంలో కూలీలకు జరుగుతున్న నష్టాన్ని పూడ్చే పరిస్థితుల్లో సర్కారు లేకపోవడంతో ప్రస్తుతం ఒక్కో గ్రామంలో రోజుకు సగటున 99 మంది కూలీలు వస్తున్నారు. . టార్గెట్​ ప్రకారం రెండొందల మంది రా వాలని చెప్పినప్పటికీ ఎండలు విపరీతంగా ఉండటం, వసతులు లేకపోవ డం వల్ల కూలీల హాజరు నామమాత్రంగానే ఉంటోంది. గతేడాది ఇదే రోజు ల్లో 96 వేల మంది కూలీలు పనులకు హాజరుకాగా, ప్రస్తుతం 88 వేల మంది వస్తున్నారు.  నిర్ధేశించిన లక్ష్యం మేరకు ఈనెలాఖరు నాటికి 34 లక్షల పనిదినా లు కంప్లీట్​ చేయాల్సి ఉండగా, ఇప్పటికీ 22 లక్షలు పూర్తయ్యాయి. స్టేట్​ లో నల్గొండ జిల్లా మూడో ప్లేస్​లో ఉందని అధికారులు చెప్పారు.