రైతుల అభివృద్ధి కోసం అనేక పథకాలు : మాలోతు కవిత

రైతుల అభివృద్ధి కోసం అనేక పథకాలు : మాలోతు కవిత

నర్సంపేట, వెలుగు : రైతుల అభివృద్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ ఎంపీ మాలోతు కవిత చెప్పారు. నర్సంపేట మార్కెట్‌‌‌‌‌‌‌‌ యార్డులో ఏర్పాటు చేసిన వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల మెగా ప్రదర్శనను శుక్రవారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌‌‌‌‌‌‌‌రెడ్డి, వరంగల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ప్రావీణ్యలతో కలిసి ప్రారంభించారు. అనంతరం జరిగిన మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ఎంపీ మాట్లాడుతూ నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి కృషి వల్లే నియోజకవర్గానికి పైలట్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టులు మంజూరు అవుతున్నాయన్నారు.

మంత్రులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలకు కూడా రాని పథకాలు నర్సంపేటకు తీసుకొస్తున్నారని కొనియాడారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌‌‌‌‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ను నర్సంపేటకు శాంక్షన్‌‌‌‌‌‌‌‌ చేయించినట్లు చెప్పారు. ఈ పథకం కింద 50 శాతం సబ్సీడీతో రైతులకు రూ. 75 కోట్ల పరికరాలు అందించనున్నట్లు చెప్పారు.

ALSO READ : పార్టీకి ద్రోహం చేసిన ఎమ్మెల్యేకు బుద్ది చెప్పాలి : జూపల్లి

పంట నష్ట పరిహారానికి సంబంధించిన రూ. 35 కోట్లు మంజూరు అయ్యాయని, త్వరలోనే ఆ చెక్కులను పంపిణీ చేస్తానని చెప్పారు సమావేశంలో జడ్పీ వైస్‌‌‌‌‌‌‌‌చైర్మన్‌‌‌‌‌‌‌‌ ఆకుల శ్రీనివాస్, అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ శ్రీవాత్సవ, మున్సిపల్‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ గుంటి రజనీ కిషన్, ఓడీసీఎంఎస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ గుగులోతు రామస్వామి నాయక్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.