- సెమీస్ బెర్త్ఖాయం చేసుకున్న ఉమ్మడి ఖమ్మం బాలబాలికలు
పినపాక, వెలుగు : అండర్–-19 బాలబాలికల 69వ స్టేట్ లెవల్ కబడ్డీ పోటీలు ఆదివారం రెండో రోజు ఉత్సాహంగా కొనసాగాయి. భద్రాద్రికొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని ఏడూళ్లబయ్యారం జడ్పీ హైస్కూల్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో తెలంగాణలోని పది ఉమ్మడి జిల్లాల నుంచి జట్లు పాల్గొన్నాయి. ఫూల్-ఏ, ఫూల్బీగా జట్లను విభజించి నిర్వహించిన లీగ్మ్యాచ్లు నేటితో ముగిశాయి. బాలుర విభాగం నుంచి ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్నగర్, బాలికల విభాగం నుంచి హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం టీమ్లు సెమీస్కు చేరినట్లు పీడీ బి.వీరన్న తెలిపారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన బాలబాలికల టీమ్లు సెమీస్కు చేరడం విశేషం. కబడ్డీ పోటీలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఏడూళ్లబయ్యారం సీఐ వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో ఎస్ఐ సురేశ్, టీఎస్ఎస్పీ బెటాలియన్పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పోటీలను తిలకించి క్రీడాకారులకు మధ్యాహ్న భోజనం వడ్డించారు. రాత్రి క్యాంప్ ఫైర్, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు స్కూల్ హెచ్ఎం కొమరం నాగయ్య తెలిపారు.
