స్టేట్ లెవల్ పోలీస్డ్యూటీ మీట్ సక్సెస్ చేయాలి : సీపీ సన్ ప్రీత్ సింగ్

స్టేట్ లెవల్ పోలీస్డ్యూటీ మీట్ సక్సెస్ చేయాలి : సీపీ సన్ ప్రీత్ సింగ్

హనుమకొండ, వెలుగు: వరంగల్ కమిషనరేట్ పరిధి మామునూరు పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో త్వరలో నిర్వహించనున్న స్టేట్ లెవల్ రెండో పోలీస్ డ్యూటీ మీట్ ను సక్సెస్ చేయాలని సీపీ సన్ ప్రీత్ సింగ్ ఆఫీసర్లను ఆదేశించారు. ఈ మేరకు డ్యూటీ మీట్​పరిశీలన బృందం సభ్యులు, కమిషనరేట్​పోలీస్​ ఆఫీసర్లతో మంగళవారం మామునూరు పీటీసీలో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆఫీసర్లతో సమావేశమయ్యారు. 

స్టేట్ లెవల్ డ్యూటీ మీట్ కు వరంగల్ కమిషనరేట్ ఆతిథ్యం ఇస్తుండటం ఆనందంగా ఉందని, డీసీపీలు, ఏసీపీలు, ఇతర ఆఫీసర్లు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని పోటీలను విజయవంతం చేయాలన్నారు. కమిటీ సభ్యులు వారికి అప్పగించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. పోటీలకు సంబంధించి ఎలాంటి అనుమానాలున్నా తన దృష్టికి తీసుకురావాలని, ప్రణాళిక ప్రకారం పని చేయాలన్నారు. సమావేశంలో డీసీపీలు అంకిత్​కుమార్, షేక్​సలీమా, రాజమహేంద్రనాయక్, పీటీసీ ప్రిన్సిపల్​పూజ, సీఐడీ ఎస్పీ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.