
ప్రైమ్ వాలీబాల్ లీగ్‌తో దేశంలో వాలీబాల్ క్రీడకు ఆదరణ పెరిగిందని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బ్లాక్‌హాక్స్–ఢిల్లీ తూఫాన్స్ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీహరి, శాట్జ్ చైర్మన్ శివసేన రెడ్డి పోటీలను ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి అన్నారు.
దేశంలోని పలు నగరాల్లో జరగాల్సిన ఈ సీజన్ పీవీఎల్ పోటీలు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మొత్తం హైదరాబాద్‌లోనే నిర్వహించడానికి చొరవ తీసుకున్న హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ జట్టు యజమాని కంకణాల అభిషేక్ రెడ్డిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. కాగా, పీవీఎల్ టీవీ వ్యూయర్‌షిప్ గత సీజన్‌తో పోలిస్తే ఈసారి రెట్టింపైందని అభిషేక్ తెలిపారు.