కరోనా ఎఫెక్ట్: ఎమర్జింగ్ మార్కెట్లకు కనీసం 2.5 లక్షల కోట్ల డాలర్లు అవసరం

కరోనా ఎఫెక్ట్: ఎమర్జింగ్ మార్కెట్లకు కనీసం 2.5 లక్షల కోట్ల డాలర్లు అవసరం

భయం నిజమయింది. మాంద్యం కోరలు చాచింది. ప్రపంచదేశాలన్నీ మరింత విలవిలలాడనున్నాయి. కరోనా వైరస్ ఇప్పటికే గ్లోబల్ ఎకానమీని రెసిషన్‌‌‌‌లోకి నెట్టేసిందని ఇంటర్నేషనల్‌‌‌‌ మానిటరీ ఫండ్‌‌‌‌ (ఐఎంఎఫ్‌‌‌‌) స్పష్టం చేసింది.   ఆర్థికమాంద్యం మొదలయిందని ప్రకటించింది. కరోనా వల్ల ఎక్కడికక్కడ వ్యాపారాలన్ని కుదేలయ్యాయి. ఎగుమతులు లేవు, దిగుమతులు లేవు.. కంపెనీల్లోకి పెట్టుబడులు రావడం లేదు.. ట్రేడింగ్ అంతా అస్థవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో ఎమర్జింగ్ మార్కెట్లు పెద్ద మొత్తంలో నష్టపోనున్నాయని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జివా చెప్పారు. ఎమర్జింగ్ మార్కెట్లలో పెద్ద మొత్తం వాణిజ్యం తగ్గిపోయిందని, ఎగుమతులు పడిపోయాయని, క్యాపిటల్ అవుట్‌‌‌‌ఫ్లోస్ పెరిగాయని వివరించారు. ఈ కరోనా మహమ్మారి నుంచి బయటపడటానికి ఎమర్జింగ్ మార్కెట్లకు కనీసం 2.5 లక్షల కోట్ల డాలర్ల(రూ.1,87,19,000 కోట్లు) నిధులు అవసరమవుతాయని అంచనావేశారు. ఇంటర్నల్ రిజర్వులు, లోకల్ మార్కెట్ల బారోయింగ్స్ సరిపోవని చెప్పారు. ఐఎంఎఫ్‌‌‌‌, ఇతర సంస్థల నిధులు అవసరం పడతాయని పేర్కొన్నారు.

ప్రపంచమంతా రెసిషన్‌‌‌‌లోనే….

ప్రస్తుతం మాంద్యం నుంచి వచ్చే ఏడాది రికవరీ సాధించవచ్చని అంచనా చేసింది. 2020, 2021కు సంబంధించిన గ్రోత్‌‌‌‌ను తాము మళ్లీ రీఅసెస్‌‌‌‌ చేశామని జార్జివా చెప్పారు. ఈ అసెస్‌‌‌‌మెంట్‌‌‌‌లో గ్లోబల్ ఎకానమీలో రెసిషన్‌‌‌‌లోకి వెళ్లిందని స్పష్టంగా తెలిసిందని, 2009 కంటే పరిస్థితి దారుణంగా ఉందని తెలిపారు. కొన్ని దేశాలు 2021లో కాస్త రికవరీ సాధిస్తుందని తాము అంచనా వేస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు.

కట్టడి చేయకపోతే.. కష్టమే…

అడ్వాన్స్ ఎకానమీ అయిన అమెరికా కరోనా వైరస్ బారిన పడి సంక్షోభంలో కూరుకుపో యిందని చెప్పారు. దీని వల్ల అభివృద్ధి చెందిన, చెందుతున్న మార్కెట్లు భారీగా నష్టపోతున్నా యని వివరించారు. దీని ప్రభావమెంత? అనే దాని పై తాము పనిచేస్తున్నట్టు జార్జివా వెల్లడించా రు. తమ అంచనాలను వచ్చే కొన్ని వారాల్లో విడుదల చేయనున్నట్టు చెప్పారు. మాంద్యం ప్రభావం చాలా కాలం ఉండనుందని వివరించారు.   ‘‘ఈ హెల్త్ క్రైసిస్‌‌‌‌ నుంచి బయటప డేందుకు ఇప్పటికే చాలా దేశాలు పలు రకాల చర్యలను తీసుకుంటు న్నాయి. పూర్తిగా దేశ దేశాలన్ని లాక్‌‌‌‌డౌన్ చేశాయి. ఇప్పటి వరకు తమ వద్దకు 81 ఎమర్జెన్సీ ఫైనాన్సింగ్ రిక్వెస్ట్‌‌‌‌ లు వచ్చాయి. వీటిలో 50 అతి తక్కువ ఆదాయం ఉన్న దేశాలవే! మొత్తంగా కరోనా వైరస్ బారి నుంచి బయటపడేందుకు ఎమర్జింగ్ మార్కెట్లకు 2.5 లక్షల కోట్ల డాలర్లు కావాలి’’ అని జార్జివా వివరించారు.