సీఏఏను రాష్ట్రాలు అడ్డుకోలేవు : అమిత్ షా

సీఏఏను రాష్ట్రాలు అడ్డుకోలేవు : అమిత్ షా
  •  దాన్ని వాపస్ తీస్కోం 

న్యూఢిల్లీ: సిటిజన్​షిప్ అమెండ్​మెంట్ యాక్ట్​(సీఏఏ)  రద్దు చేసే ప్రసక్తే లేదని కేంద్ర హోం మంత్రి అమిత్​షా చెప్పారు. దేశానికి సంబంధించిన ఈ చట్టాన్ని కేరళ, తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాలు అడ్డుకోలేవని స్పష్టం చేశారు. షా గురువారం ఓ న్యూస్ చానల్​ ఇంటర్వ్యూలో  మాట్లాడారు. సీఏఏతో దేశంలోని మైనారిటీలు సహా ఎవరి సిటిజన్​షిప్​కూ ముప్పు లేదన్నారు. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్  నుంచి వచ్చిన హిందూ, బౌద్ధ, జైన, సిక్కు, క్రిస్టియన్, పార్శీ శరణార్థులకు హక్కులు, సిటిజన్​షిప్ కల్పించేందుకు మాత్రమే సీఏఏ అవకాశం కల్పిస్తుందని  అమిత్​ షా స్పష్టం చేశారు.