ప్రాజెక్టుల అప్పగింతకు తెలంగాణ, ఏపీ నో అబ్జక్షన్

ప్రాజెక్టుల అప్పగింతకు తెలంగాణ, ఏపీ నో అబ్జక్షన్
  • కేఆర్ఎమ్​బీకి తెలుగు రాష్ట్రాల వెల్లడి
  • వాటాల పంపకం కోసం త్రిసభ్య కమిటీ
  • ముగిసిన కృష్ణబోర్డు సమావేశం

హైదరాబాద్​: కృష్ణా బోర్డు పరిధిలో ప్రాజెక్టుల ఆపరేషన్ కు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఒప్పుకున్నాయి. ఇవాళ హైదరాబాద్​లో  కేఆర్​ఎంబీ సమావేశం నిర్వహించారు. రెండు రాష్ట్రాల్లో  నీటి వాటాల పంపకం కోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.  వాటాల కేటాయింపుపై త్రిసభ్య కమిటీదే తుది నిర్ణయమని తెలిపాయి.

అనంతరం ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి  మాట్లాడుతూ  బోర్డు పరిధిలో మొత్తం 15 ఓటిస్ లలో  9 తెలంగాణ, 6 ఆంధ్రప్రదేశ్ కు చెందినవి ఉన్నాయన్నారు. ప్రాజెక్టుల  ఆపరేషనల్ కోసం ఇరు రాష్ట్రాల నుంచి స్టాఫ్​ కేటాయింపు ఉంటుందన్నారు.  ప్రాజెక్టుల ఆపరేషనల్ ప్రోటోకాల్ త్రిసభ్య కమిటీ అప్పుడున్న పరిస్థితుల్లో తీసుకుంటారన్నారు.

లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుంచి రెండు టీఎంసీలు, మార్చిలో రైట్ మెన్ కెనాల్ నుంచి మూడు టీఎంసీలు  ఏపీకి విడుదల చేయడానికి ఒప్పుకున్నారన్నారు.  ఏప్రిల్ లో అయిదు టీఎంసీలు ఏపీకి ముందుగానే కేటాయిస్తారన్నారు.  ప్రాజెక్టుల ఆపరేషనల్ కోసం తెలంగాణ ఒప్పుకుందని ఆయన తెలిపారు.

పవర్ స్టేషన్స్ పై ఇంకా  నిర్ణయం తీసుకోలే

 తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ మాట్లాడుతూ  ప్రాజెక్టుల ఆపరేటింగ్ అంతా కేఆర్​ఎంబీకి ఇవ్వడం జరిగిందన్నారు. పవర్ స్టేషన్స్ పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.  నాగార్జున సాగర్  ను తెలంగాణ, శ్రీశైలంను  ఏపీ చూసుకుంటాయన్నారు.   ప్రాజెక్టులన్నీ ఇక నుంచి బోర్డు పరిధిలో నడుస్తాయన్నారు.

 రాష్ట్ర డిమాండ్స్ తీర్చాలని కేంద్రానికి లేఖలు రాసామని, ఇంకా అక్కడ నుంచి నిర్ణయం రాలేదన్నారు.   ప్రాజెక్టుల వద్ద భద్రతను పరిస్థితిని భట్టి బోర్డు కనుసన్నల్లో జరుగుతుందన్నారు. కేఆర్​ఎంబీ పరిధిలో ఉన్న 15 ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి వెళ్తాయన్నారు. ప్రాజెక్టులను పూర్తిగా అప్పగించలేదన్నారు.

ఆపరేషనల్, నీటి విడుదలను  బోర్డు చూసుకుంటుందన్నారు. సీఆర్పీఎప్​ దళాలు సైతం కృష్ణా బోర్డు పరిధిలోనే ఉంటాయన్నారు. ప్రాజెక్టుల నిర్వహణ కోసం 40: 45 స్టాఫ్​ కేటాయింపు కావాలని అడుగుతున్నామని ఆయన తెలిపారు.