ఎమ్మెల్యే రాజయ్య కు చేదు అనుభవం

ఎమ్మెల్యే రాజయ్య కు చేదు అనుభవం

జనగామ జిల్లా: స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే టీ రాజయ్యకు చేదు అనుభవం ఎదురైంది. స్టేషన్ ఘన్ పూర్ నియోజవర్గంలోని జఫర్ఘడ్ మండలం ఓబులాపూర్ లో బతుకమ్మ చీరలు, పెన్షన్ కార్డులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే రాజయ్యను స్థానిక దళితులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతున్న సమయంలో దళిత బంధుపై ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దళిత బంధుకు టీఆర్ఎస్ వాళ్లను ఎంపిక చేస్తున్నారంటూ వారు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. దళిత బంధు ఇప్పిస్తామంటూ స్థానిక టీఆర్ఎస్ నేతలు డబ్బులు వసూలు చేస్తున్నారని కంప్లైంట్ చేశారు.

అయితే తాము అధికారంలో ఉన్నామని, తమ పార్టీ వాళ్లకే దళిత బంధు ఇచ్చుకుంటామని అక్కడున్న టీఆర్ఎస్ నేతలు చెప్పడంతో... తమకు దళిత బంధు ఇవ్వారా అంటూ ఇతర పార్టీలకు చెందిన దళితులు  ఫైరయ్యారు. దీంతో ఎమ్మెల్యే సమక్షంలోనే దళితులకు, టీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం, తోపులాట  జరిగింది.