- లక్ష మందికి ఉపాధి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వేలంలో (ఆరవ రౌండ్ ) స్టీల్, పవర్ సిమెంట్ కంపెనీలు పెద్ద సంఖ్యలో బొగ్గుగనులను దక్కించుకున్నాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ఛత్తీస్‌గఢ్‌లోని బనాయ్, భలుముండా గనులను, జార్ఖండ్‌లోని పర్బత్‌పూర్ సెంట్రల్, సీతానాల గనులను గెలుచుకుంది. జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ మధ్యప్రదేశ్ లోని మార్వాటోలా–7 గనిని కైవసం చేసుకుంది. జిందాల్ పవర్ ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న గారే పాల్మా సెక్టార్–1, గారే పాల్మా 4/2 గారే పాల్మా 4/3 బొగ్గు గనులను గెలుచుకుంది.
రుంగ్తా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒడిశాలోని సఖిగోపాల్–బి కంకిలి ఛెందిపడ (రివైజ్డ్) బ్లాక్‌లను, జార్ఖండ్‌లోని చోరిటాండ్ తిలియాయాను కైవసం చేసుకుంది. జార్ఖండ్, ఒడిశాలోని పాటల్ ఈస్ట్ (తూర్పు భాగం) గనిని ఆర్సీఆర్ స్టీల్ వర్క్స్ గెలుచుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని కాగ్రా జోయ్‌దేవ్ గనిని మెటలర్జికల్ ఇండస్ట్రీ దక్కించుకుంది. అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ మహారాష్ట్రలోని దహెగావ్–గోవారీ గనిని, అల్ట్రాటెక్ సిమెంట్ మధ్యప్రదేశ్‌లోని అర్జుని ఈస్ట్‌ను, దాల్మియా సిమెంట్ (భారత్) మధ్యప్రదేశ్‌లోని మాండ్లా నార్త్‌ను గెలుచుకుంది.
