
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్‌లో హర్యానా స్టీలర్స్, బెంగాల్ వారియర్స్ రెండో విజయం సొంతం చేసుకున్నాయి. ఆదివారం జరిగిన మ్యాలో స్టీలర్స్ 35–33తో దబాంగ్ ఢిల్లీ కేసీ జట్టుపై గెలిచింది. స్టీలర్స్ తరఫున సిద్దార్థ్ దేశాయ్ (10 పాయింట్లు), ఆశీష్ (7), వినయ్ (5) రాణించారు. ఢిల్లీ కెప్టెన్ నవీన్ కుమార్ 16 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు.
మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 48–38తో తమిళ్ తలైవాస్‌పై ఘన విజయం సాధించింది. వారియర్స్ కెప్టెన్ మణీందర్ సింగ్ 16, శుభమ్ షిండే 11 పాయింట్లతో సత్తా చాటారు. సోమవారం జరిగే మ్యాచ్‌ల్లో జైపూర్‌తో గుజరాత్, బెంగళూరుతో యూపీ యోధాస్ తలపడతాయి.