హాలీవుడ్ లో RRR 2.. డైరెక్టర్ స్పీల్ బర్గ్ అంటూ ప్రచారం.

హాలీవుడ్ లో RRR 2.. డైరెక్టర్ స్పీల్ బర్గ్ అంటూ ప్రచారం.

దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) తెరకెక్కించిన త్రిపుల్ ఆర్(RRR) మూవీ ప్రపంచవ్యాప్తగా ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రామ్ చరణ్(Ram charan), ఎన్టీఆర్(NTR) హీరోలుగా వచ్చిన ఈ సినిమాకు ప్రపంచమంతా ఫిదా అయిపోయింది. ఆస్కార్(Ocar) రేంజ్ లో కూడా సత్తా చాటిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర దాదాపు రూ.1200 కోట్లు కలెక్ట్ చేసింది. 

త్రిపుల్ ఆర్ కు సీక్వెల్ ఉంటుందా?  

ప్రపంచవ్యాప్తంగా త్రిపుల్ ఆర్ సాధించిన విజయంతో.. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని కూడా ప్రకటించారు మేకర్స్. అయితే రిలీజ్ తరువాత కొంతకాలానికి రాజమౌళి సీక్వెల్ వార్తలపై స్పందిస్తూ.. మళ్ళీ అలాంటి పవర్ ఫుల్ లైన్, పవర్ ఫుల్ ఎమోషన్ సెట్ అయితే తప్పకుండా సీక్వెల్ చేస్తామని ప్రకటించారు. 

ALSO READ :ప్రభాస్ రెమ్యునరేషన్ రూ.100 కోట్లు?.. ఇండియాలోనే టాప్ యాక్టరా!

క్లారిటీ ఇచ్చిన రచయిత విజయేంద్రప్రసాద్

త్రిపుల్ ఆర్ సినిమా సీక్వెల్ పై తాజాగా ఆ చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్(Vijayendra prasad) క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. త్రిపుల్ ఆర్ సీక్వెలపై ప్లాన్స్ ఉన్నాయని, రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తారని, కాకపోతే ఈసారి త్రిపుల్ ఆర్ సినిమాను హాలీవుడ్ లో తెరకెక్కిస్తామని చెప్పుకొచ్చారు. 

త్రిపుల్ ఆర్ సినిమాకు దర్శకుడిగా స్టీవెన్ స్పీల్ బర్గ్?

త్రిపుల్ ఆర్ సినిమా సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్.. దర్శకుడి విషయంలో కన్ఫ్యూజన్ లో పడేశారు. త్రిపుల్ ఆర్ సీక్వెల్ సినిమాను రాజమౌళి డైరెక్ట్ చేయకపోవచ్చని, ఆయన పర్యవేక్షణలో వేరే దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారని చెప్పుకొచ్చారు. ఈ డైరెక్టర్స్ లిస్టులో హాలీవుడ్ డైరెక్టర్ స్పీల్ బర్గ్(Steven Spielberg) పేరు బాగా వినిపిస్తోంది. ప్రస్తతం అయన ఏ సినిమా చేయడంలేదు. దీంతో త్రిపుల్ ఆర్ సీక్వెల్ ను హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట స్పీల్ బర్గ్. ఆ మధ్య ఆస్కార్ వేడుకల్లో కూడా రాజమౌళితో త్రిపుల్ ఆర్ సినిమా గురించి ముచ్చటించారు స్పీల్ బర్గ్. దీంతో ఈ సినిమాను ఆయన డైరెక్ట్ చేయనున్నాడనే వార్తలు బలంగా వినిపిస్తన్నాయి. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాలంటే.. అధికారిక ప్రకటన రావాల్సిందే.