2021కి లాభాలతో వీడ్కోలు పలికిన మార్కెట్లు

2021కి లాభాలతో వీడ్కోలు పలికిన మార్కెట్లు

2021 చివరి రోజు స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఇవాళ మార్కెట్ ప్రారంభం నుంచి బుల్ జోష్ కనిపించింది. వచ్చే ఏడాది మార్కెట్లు భారీగా లాభాలార్జించే అవకాశముందన్న విశ్లేషణలు ఇన్వెస్టర్లలో ఉత్సాహం నింపాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లు నష్టాల్లో ఉన్నప్పటికీ దేశీయంగా నెలకొన్న పరిస్థితులు కొనుగోళ్ల జోరుకు కారణమైంది. టెక్స్టైల్పై జీఎస్టీ పెంపు నిర్ణయం వాయిదా పడటం.. జనవరిలో థర్డ్ క్వార్టర్ రిజల్డ్ పాజిటివ్ గా రావచ్చన్న అంచనాలు మార్కెట్కు కలిసొచ్చాయి. 

ఉదయం 57,850పాయింట్ల వద్ద ప్రారంభమైన మార్కెట్ లో ఆరంభస్థాయే ఇవాళ్టి కనిష్ఠ స్థాయి. ఒకదశలో కొనుగోళ్ల మద్దతుతో 58వేల 409 పాయింట్ల గరిష్ఠ స్థాయిని నమోదుచేసిన సెన్సెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి 459.50 పాయింట్ల లాభంతో 58,254 వద్ద క్లోజయింది. ఆటో మొబైల్, మెటల్, రియల్టీతో పాటు జీఎస్టీ నిర్ణయం వాయిదాతో టెక్స్టైల్ స్టాక్స్ కూడా లాభాలు ఆర్జించాయి.  నిఫ్టీ సైతం లాభాలతో ఈ ఏడాదికి వీడ్కోలు పలికింది. 150పాయింట్ల ప్రాఫిట్తో 17,354 వద్ద ముగిసింది. 
 

For more news..

అంబేద్కర్ విగ్రహానికి వివేక్ వెంకటస్వామి ఆర్థిక సాయం

కేరళలో 100 దాటిన ఒమిక్రాన్ కేసులు