సీఎం, మంత్రుల జీతాలపై ట్యాక్స్​ను వాళ్లతోనే కట్టించాలి

సీఎం, మంత్రుల జీతాలపై ట్యాక్స్​ను వాళ్లతోనే కట్టించాలి
  •     హైకోర్టులో ఎఫ్‌‌జీజీ పిల్

హైదరాబాద్, వెలుగు : సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు తీసుకునే జీతాలపై ఆదాయ పన్ను ప్రభుత్వమే చెల్లించేలా 2015లో వెలువడిన జీవో 917 రాజ్యాంగ విరుద్ధమని ఫోరం ఫర్‌‌ గుడ్‌‌ గవర్నెన్స్‌‌ (ఎఫ్‌‌జీజీ) పేర్కొంది. ఆ జీవోను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరుతూ ఎఫ్‌‌జీజీ కార్యదర్శి సోమ శ్రీనివాసరెడ్డి హైకోర్టులో పిల్‌‌ వేశారు. దీనిని చీఫ్‌‌ జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే ఆధ్వర్యంలోని బెంచ్‌‌ విచారణ చేయనుంది.

సీఎస్, సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల జీతాలపై ఆదాయపు పన్నును ప్రభుత్వం చెల్లించడం చట్ట వ్యతిరేకమన్నారు. జనం తమ ఆదాయంపై పన్ను చెల్లించినట్టుగానే వాళ్ల నుంచి కూడా వసూలు చేయాలని కోరారు.